ఏమైంది.. నేనెలా ఔటయ్యా..! వోక్స్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సిరాజ్.. ఆ తరువాత రొనాల్డో తరహాలో సంబరాలు.. వీడియో వైరల్

మూడోరోజు ఆట ప్రారంభమైన సమయం నుంచి ఇంగ్లాండ్ జట్టుదే పైచేయిగా కొనసాగింది. అయితే, లంచ్ తరువాత వాషింగ్టన్ సుందర్ స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు తీసి భారత్‌ను పోటీలోకి తీసుకొచ్చాడు.

Mohammed Siraj Ronaldo style Celebrations

IND vs ENG 4th Test: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా నాల్గో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 544/7 పరుగుల వద్ద పటిష్ఠ స్థితిలో ఉంది. ఫలితంగా ఆ జట్టు ఆధిక్యం 186 పరుగులకు చేరింది. మూడోరోజు ఆటలో ఇంగ్లాండ్ బ్యాటర్లను పెవిలియన్‌కు పంపించేందుకు భారత బౌలర్లు నానా ఇబ్బందులు పడ్డారు.

Also Read: సిరాజ్ భయ్యా అలా చేశావేంటి..! పాపం.. వికెట్ల వద్ద కుప్పకూలిపోయిన బెన్ స్టోక్స్.. ‘వాట్’ అంటూ దగ్గరికెళ్లినా నో రెస్పాన్స్.. వీడియో వైరల్

మూడోరోజు ఆట ప్రారంభమైన సమయం నుంచి ఇంగ్లాండ్ జట్టుదే పైచేయిగా కొనసాగింది. అయితే, లంచ్ తరువాత వాషింగ్టన్ సుందర్ స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు తీసి భారత్‌ను పోటీలోకి తీసుకొచ్చాడు. వాషింగ్టన్ బౌలింగ్‌లో పోప్ స్లిప్‌లో క్యాచ్ ఇచ్చాడు. ఆ క్యాచ్‌ను కేఎల్ రాహుల్ అద్భుతంగా అందుకున్నాడు.

ఆ తరువాత బ్రూక్ (3) స్టంపౌటయ్యాడు. దీంతో ఎనిమిది పరుగుల తేడాతో ఇంగ్లాండ్ రెండు వికెట్లు కోల్పోయింది. అప్పటి ఇంగ్లాండ్ జట్టు భారత్ స్కోరుకు తొమ్మిది పరుగుల దూరంలో నిలిచింది. కొద్దిసేపటి తరువాత రూట్ (150) ను జడేజా ఔట్ చేశాడు. ఆ తరువాత జెమీ స్మిత్ (9) బుమ్రా బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. అయితే, చివరిలో క్రిస్ వోక్స్ వికెట్‌ను సిరాజ్ పడగొట్టాడు.


సిరాజ్ అద్భుత బంతితో వోక్స్‌ను బోల్తా కొట్టించాడు. లో‌బౌన్స్ బౌలింగ్‌తో కన్ఫ్యూజ్ చేశాడు. సిరాజ్ వేసిన బంతి లోబౌన్స్‌తో వెళ్లింది. వోక్స్ ఆ బంతిని డిఫెండ్ ఆడే ప్రయత్నం చేయగా.. బ్యాట్ చివరి భాగంలో బంతి తాకింది. ఆ తరువాత నేరుగా వెళ్లి వికెట్లను తాకింది. దీంతో వోక్స్ ఔట్ అయ్యాడు. అయితే, వోక్స్‌కు ఏం జరిగిందో అర్ధంకాలేదు. ఆ బంతి వికెట్లను ఎలా తాకిందో అర్థంకాక అలానే చూస్తుండిపోయాడు. ఆ వెంటనే తేరుకొని పెవిలియన్ వైపు అడుగులు వేశాడు. ఇదే సమయంలో సిరాజ్ రొనాల్డో తరహాలో సంబరాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.