Ben Stokes
Ben Stokes: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ రెండో వన్డే మ్యాచ్ పూణె వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ ఆడటానికి టీమ్ అంతా లేడీస్ పర్‌ఫ్యూమ్ పూసుకుని గ్రౌండ్ లోకి అడుగుపెట్టామని చెప్తున్నాడు ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్. ఫీల్డ్ లోకి అడుగుపెట్టేముందు ఇంగ్లాండ్ టీం ఉమెన్ డియోడ్రంట్ వాడుతుందంటున్నాడు. మెన్ డియోడ్రంట్ కంటే అదే బెటర్ స్మెల్ వస్తుందని అతని ఫేవరెట్ స్మెల్ గురించి బయటపెట్టాడు.
దానిమ్మ ఫ్లేవర్ ఉన్న డియోడ్రంట్ చాలా బెటర్ గా అనిపిస్తుంది. నేనొక్కడినే కాదు టీం మొత్తం అదే డియోడ్రంట్ వాడతాం. లారా వుడ్స్, మెక్ కొయిస్ట్, జామీ ఓ హారా కూడా ఇదే పర్‌ఫ్యూమ్ వాడతారు.
సొంతగడ్డపై ఇండియా నిర్దేశించిన అత్యధిక టార్గెట్ ను చేధించింది ఇంగ్లాండ్ టీం. చారిత్రకమైన ఈ చేధనలో టీమండియా 6 వికెట్లు మిగిలి ఉండగానే 6ఓవర్లకు ముందే మ్యాచ్ గెలిచేశారు. గేమ్ ఆరంభంలో 117డెలివరీల్లో 175పరుగుల రికార్డు బ్యాటింగ్ భాగస్వామ్యం నెలకొల్పారు జానీ బెయిర్ స్టో – బెన్ స్టోక్స్.
What was the soft signal by the field-umpire? #BenStokes @ICC #EngVsInd #INDvENG #ICC #BCCI pic.twitter.com/ww81yH9oHL
— Prashant (@vprashant4) March 26, 2021
స్టోక్స్ నాటౌట్‌పై థర్డ్ అంపైర్ నిర్ణయం
భువనేశ్వర్ వేసిన ఇన్నింగ్స్ 26వ ఓవర్ అయిదో బంతిని స్టోక్స్ మిడాన్ దిశగా షాట్‌ను ఆడాడు. సింగిల్ పూర్తి చేసిన స్టోక్స్ రెండో పరుగు కోసం ప్రయత్నించగా కుల్దీప్ వేసిన త్రో నేరుగా వికెట్లను తాకింది. స్టోక్స్ బ్యాట్ క్రీజులో లేకపోవడంతో అంతా అవుటేనని భావించారు. అయితే రిప్లేలో చాలాసార్లు పరీక్షించిన థర్డ్ అంపైర్ క్లారిటీ లేకపోవడంతో నాటౌట్‌గా ప్రకటించాడు. అయితే స్టోక్స్ బ్యాట్ గీత దాటి లోపలికి రాకముందే బంతి వికెట్లను గిరాటేసిందని.. అది ఔటేనని యువరాజ్ సింగ్ సహా పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.