Ind vs Eng Semi Final : ఇంగ్లాండ్ ఇంటికి.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్.. తుది పోరులో సౌతాఫ్రికాతో ఢీ!

Ind vs Eng : టీ20 ప్రపంచ కప్‌‌లో అదరగొట్టిన టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో సెమీ ఫైనల్లో రోహిత్ సేన 68 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Ind vs Eng Semi Final : టీ20 ప్రపంచ కప్‌‌లో అదరగొట్టిన టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో సెమీ ఫైనల్లో రోహిత్ సేన 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ నెల 29న జరుగనున్న ఫైనల్ పోరులో సౌతాఫ్రికాతో భారత్ తలపడనుంది. అయితే, టీమిండియా నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఇంగ్లాండ్ ఘోరంగా విఫలమైంది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు పేలవ ప్రదర్శనతో ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ బాట పట్టారు. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో 16.4 ఓవర్లలో 103 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్ అయింది.

ఇంగ్లాండ్ ఓపెనర్ జోస్ బట్లర్ (23) పరుగులకే తొలి వికెట్ కోల్పోగా, ఫిల్ సాల్ట్ (5) పరుగులకే చేతులేత్తేశాడు. ఆ తర్వాత వచ్చిన హ్యారీ బ్రూక్ (25), జోఫ్రా ఆర్చర్ (21), లియామ్ లివింగ్ స్టోన్ (11) రాణించగా, మొయిన్ అలీ (8), సామ్ కరన్ (2), క్రిస్ జోర్డాన్ (1), ఆదిల్ రషీద్ (2), రీస్ టోప్లీ (3) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత్ బౌలర్లలో అక్షర్ పటేల్, కుల్దీప్ యాద్ తలో 3 వికెట్లు తీయగా, బుమ్రా 2 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ పతనాన్ని శాసించిన అక్షర్ పటేల్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

టీ20 ప్రపంచ కప్‌ కీలక పోరులో భాగంగా టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య హోరాహోరీగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్ చేరనుంది. రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇరుజట్లు పోటాపోటీగా తలపడుతున్నాయి. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకోగా.. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆరంభంలో వరుణుడు మ్యాచ్ కు అడ్డంకిగా నిలిచినప్పటికీ ఆలస్యంగా మ్యాచ్ ఆరంభమైంది. మధ్యలో కాసేపు వర్షం కారణంగా బ్రేక్ పడినా మళ్లీ కాసేపటికి తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్ ప్రారంభమైంది.

ఇంగ్లాండ్ లక్ష్యం 172 పరుగులు :
టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. దాంతో ప్రత్యర్థి జట్టు ఇంగ్లాండ్‌కు 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్ ఆటగాళ్లలో ఓపెనర్ విరాట్ కోహ్లీ (9) పరుగులకే చేతులేత్తేశాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (57; 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

సూర్య కుమార్ యాదవ్ (47; 36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్) అద్భుతంగా రాణించాడు. హార్దిక్ పాండ్యా (23), అక్షర్ పటేల్ (10) పరుగులు చేయగా, రవీంద్ర జడేజా (17 నాటౌట్) అజేయంగా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు తీయగా, రీస్ టోప్లీ, జోఫ్రా ఆర్చర్, సామ్ కరన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీసుకున్నారు.


వర్షం వెలియడంతో మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్ విరాట్ కోహ్లీ 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. ఈ మ్యాచులో గెలిచిన జట్టు ఫైనల్లో సౌతాఫ్రికాతో తలపడుతుంది.

భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా

ఇంగ్లండ్ జట్టు: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీ

టీ20 ప్రపంచ కప్‌లో రెండో సెమీఫైనల్‌కు వరుణుడు మొదట్లో అడ్డుతగిలాడు. టీమిండియా, ఇంగ్లండ్ మధ్య గుయానాలో ఈ మ్యాచ్ జరుగుతోంది. మొదట వర్షం కురియడంతో మైదానంలో కవర్లు వేశారు. టాస్ ఆలస్యంగా వేశారు. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ ర‌ద్దు అయితే నిబంధ‌న‌ల ప్ర‌కారం భార‌త్ ఫైన‌ల్‌కు చేరుకుంటుంది. ఇంగ్లండ్ ఇంటికి వెళ్తుంది.

రెండోసారి టీ20 ప్రపంచ కప్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా వ్యూహాలు రచించుకుంది. 2007లో నిర్వహించిన టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా కప్ కొట్టింది. అయితే, అప్పటినుంచి ఇప్పటివరకు కప్‌ను మరోసారి ముద్దాడలేదు. టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లతో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లూ ఫాంలోనే ఉండడంతో గెలుపుపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రపంచ కప్ విజేతలు వీరే
ఏడాది ఏ దేశంలో జరిగింది? గెలుపు
2007 South Africa India
2009 England Pakistan
2010 West Indies England
2012 Sri Lanka West Indies
2014 Bangladesh Sri Lanka
2016 India West Indies
2021 UAE/Oman Australia
2022 Australia England
2024  ? ?

Also Read: 0,2,9,10,0,2,8,8,0,2,2.. ఇది అఫ్గానిస్థాన్ ఫోన్ నంబ‌ర్ భ‌య్యా.. !

ట్రెండింగ్ వార్తలు