IND vs NEP : భారత్ ఘన విజయం.. సూపర్-4కి అర్హత

ఆసియాక‌ప్ 2023లో భాగంగా ప‌ల్లెక‌లె వేదిక‌గా నేపాల్‌తో భార‌త జ‌ట్టు త‌ల‌ప‌డుతోంది. టాస్ గెలిచిన భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

IND vs NEP

నేపాల్‌పై భారత్ సూపర్ విక్టరీ
ఆసియాక‌ప్ 2023లో భాగంగా ప‌ల్లెక‌లె వేదిక‌గా నేపాల్‌తో జరిగిన మ్యాచ్ లో భార‌త ఘన విజయం సాధించింది. 145 పరుగుల టార్గెట్ ను రోహిత్ సేన ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే 20.1 ఓవర్లలోనే చేజ్ చేసింది. దాంతో 10 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. మరో 17 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (59 బంతుల్లో 74 పరుగులు..నాటౌట్), శుభ్ మన్ గిల్(62 బంతుల్లో 67 పరుగులు నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఈ గెలుపుతో భారత్ సూపర్ -4కి అర్హత సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 230 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత భారీ వర్షం వల్ల మ్యాచ్ ని కుదించారు. టీమిండియాకు 23 ఓవర్లలో 145 పరుగుల టార్గెట్ ఇచ్చారు.

శుభ్ మన్ గిల్ హాఫ్ సెంచరీ
నేపాల్ తో మ్యాచ్ లో భారత ఓపెనర్లు దుమ్మరేపారు. తొలుత కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ బాదాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ కూడా అర్థశతకం సాధించాడు. గిల్ 47 బంతుల్లో 52 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 39 బంతుల్లోనే 50 రన్స్ చేశాడు.

రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ బాదాడు. 39 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు.


23 ఓవర్లకు మ్యాచ్ కుదింపు.. భారత్ టార్గెట్ 145 రన్స్

భారీ వర్షం ఆగింది. దాంతో భారత్, నేపాల్ మ్యాచ్ కు లైన్ క్లియర్ అయ్యింది. మ్యాచ్ ను 23 ఓవర్లకు కుదించారు. భారత్ టార్గెట్ 145 పరుగులు.

ఆసియాక‌ప్ 2023లో భాగంగా ప‌ల్లెక‌లె వేదిక‌గా నేపాల్‌తో భార‌త జ‌ట్టు త‌ల‌ప‌డుతోంది. టాస్ గెలిచిన భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. జ‌స్‌ప్రీత్ బుమ్రా వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో స్వ‌దేశానికి రావ‌డంతో అత‌డి స్థానంలో మ‌హ్మ‌ద్ ష‌మీని తీసుకున్నారు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 04 Sep 2023 08:27 PM (IST)

    మ‌రొసారి వ‌చ్చిన వ‌రుణుడు

    మ్యాచ్‌కు మ‌రోసారి వ‌రుణుడు అంత‌రాయం క‌లిగించాడు. భార‌త ఇన్నింగ్స్ 2.1 ఓవ‌ర్ల ఆట పూర్తి అయిన త‌రువాత వ‌ర్షం రావ‌డంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. అప్ప‌టికి భార‌త స్కోరు 17/0. రోహిత్ శ‌ర్మ (4), శుభ్‌మ‌న్ గిల్ (12) క్రీజులో ఉన్నారు.

  • 04 Sep 2023 08:20 PM (IST)

    దూకుడుగా ఆడుతున్న గిల్‌

    231 టార్గెట్‌ను ఛేదించేందుకు టీమ్ఇండియా బ‌రిలోకి దిగింది. శుభ్‌మ‌న్ గిల్‌, రోహిత్ శ‌ర్మ ఓపెన‌ర్లుగా వ‌చ్చారు. కరణ్ కేసీ మొద‌టి ఓవ‌ర్‌ను వేయ‌గా వైడ్ రూపంలో ఒక్క ప‌రుగు మాత్ర‌మే వ‌చ్చింది. సోంపాల్ కామి వేసిన రెండో ఓవ‌ర్‌లో శుభ్‌మ‌న్ గిల్ మూడు ఫోర్లు కొట్టాడు. 2 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 12/0. రోహిత్ (0), గిల్ (12) లు క్రీజులో ఉన్నారు.

  • 04 Sep 2023 07:42 PM (IST)

    నేపాల్ ఆలౌట్‌

    భార‌త బౌల‌ర్ల ధాటికి నేపాల్ జ‌ట్టు 48.2 ఓవ‌ర్ల‌లో 230 ప‌రుగుల‌కు ఆలౌటైంది. నేపాల్ బ్యాట‌ర్ల‌లో ఆసిఫ్ షేక్ (58; 97 బంతుల్లో 8 ఫోర్లు) అర్థ‌శ‌త‌కంతో ఆక‌ట్టుకోగా సోంపాల్ కామి (48) కుశాల్ భుర్టెల్ (38), దీపేంద్ర సింగ్ ఐరీ (29)లు రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో ర‌వీంద్ర జ‌డేజా, మ‌హ్మ‌ద్ సిరాజ్‌లు చెరో మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, మహ్మ‌ద్ ష‌మి, హార్దిక్ పాండ్య‌, శార్దూల్ ఠాకూర్ లు ఒక్కొ వికెట్ తీశారు.

  • 04 Sep 2023 07:20 PM (IST)

    200 దాటిన స్కోరు

    వికెట్లు ప‌డుతున్న‌ప్ప‌టికి నేపాల్ బ్యాట‌ర్లు ప‌రుగుల రాకకు అడ్డుక‌ట్ట‌ప‌డ‌డం లేదు. 44వ ఓవ‌ర్‌లో 5 ప‌రుగులు రావ‌డంతో నేపాల్ స్కోరు 200 దాటింది. 44 ఓవ‌ర్ల‌కు నేపాల్ స్కోరు 202 7. సోమ్‌పాల్ (28), సందీప్‌ లామిచానె (4)లు క్రీజులో ఉన్నారు.

  • 04 Sep 2023 07:18 PM (IST)

    ఏడో వికెట్ ఔట్‌

    నేపాల్ ఏడో వికెట్ న‌ష్ట‌పోయింది. హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో (41.1వ ఓవ‌ర్‌) దీపేంద్ర సింగ్ (29) ఎల్బీడ‌బ్ల్యూగా వెనుదిరిగాడు.

  • 04 Sep 2023 06:50 PM (IST)

    శాంతించిన వ‌రుణుడు

    వ‌ర్షం త‌గ్గ‌డంతో మ్యాచ్ తిరిగి ప్రారంభ‌మైంది. ఎలాంటి ఓవ‌ర్ల కుదింపు లేదు.

  • 04 Sep 2023 05:54 PM (IST)

    వ‌ర్షం వ‌స్తోంది

    అనుకున్న‌ట్లుగా మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం క‌లిగించింది. 37.5 ఓవ‌ర్ల ఆట పూర్తి అయిన త‌రువాత వ‌ర్షం మొద‌లైంది. ఆట‌గాళ్లు గ్రౌండ్‌ను వీడ‌గా, మైదాన సిబ్బంది పిచ్‌ను క‌వ‌ర్ల‌తో క‌ప్పేశారు. అప్ప‌టికి నేపాల్ స్కోరు 178/6.

  • 04 Sep 2023 05:43 PM (IST)

    32 ఓవ‌ర్ల‌కు నేపాల్ స్కోరు 145/6

    భార‌త బౌల‌ర్లు క్ర‌మం త‌ప్ప‌కుండా వికెట్లు ప‌డ‌గొడుతున్నారు. మ‌హ్మ‌ద్ సిరాజ్ వేసిన 32 ఓవ‌ర్ ఐదో బంతికి గుల్షాన్ జా (33) ఇషాన్ కిష‌న్ చేతికి చిక్కాడు. 32 ఓవ‌ర్ల‌కు నేపాల్ స్కోరు 145/6.

  • 04 Sep 2023 04:56 PM (IST)

    25 ఓవ‌ర్ల‌కు నేపాల్ స్కోరు 109/4

    నేపాల్ ఇన్నింగ్స్‌లో స‌గం ఓవ‌ర్లు పూర్తి అయ్యాయి. కుల్దీప్ వేసిన 25వ ఓవ‌ర్‌లో ఒక్క ప‌రుగు మాత్ర‌మే వ‌చ్చింది. 25 ఓవ‌ర్ల‌కు నేపాల్ స్కోరు 109/4. అసిఫ్‌ షేక్ (47), గుల్షాన్‌ జా (6) ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

  • 04 Sep 2023 04:51 PM (IST)

    కుశాల్ మ‌ల్లా ఔట్‌

    ర‌వీంద్ర జ‌డేజా స్పిన్ మాయాజాలానికి నేపాల్ బ్యాట‌ర్లు విల‌విల‌లాడుతున్నారు. జ‌డేజా వేసిన 21.5 వ‌ ఓవ‌ర్ బంతికి కుశాల్ మ‌ల్లా (2) సిరాజ్ చేతికి చిక్కాడు. జ‌డ్డూకి ఇది మూడో వికెట్‌. అంత‌క ముందు ఓవ‌ర్‌లో (19.6వ ఓవ‌ర్‌) నేపాల్ కెప్టెన్ పౌడెల్‌(5) కూడా ఔట్ చేశాడు.

  • 04 Sep 2023 04:23 PM (IST)

    భీమ్ షార్కి క్లీన్ బౌల్డ్‌

    నేపాల్ మ‌రో వికెట్ కోల్పోయింది. జ‌డేజా బౌలింగ్‌లో(15.6వ ఓవ‌ర్‌) భీమ్ షార్కి (7) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 77 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది.

  • 04 Sep 2023 03:53 PM (IST)

    మొద‌టి వికెట్ కోల్పోయిన నేపాల్‌

    ఎట్ట‌కేల‌కు నేపాల్ జ‌ట్టు మొద‌టి వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ (9.5వ ఓవ‌ర్‌) బౌలింగ్‌లో కుశాల్ బార్టెల్ (38; 25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) ఇషాన్ కిష‌న్ చేతికి చిక్కాడు. దీంతో నేపాల్ 65 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ ప‌డింది.

  • 04 Sep 2023 03:24 PM (IST)

    5 ఓవ‌ర్ల‌కు నేపాల్ స్కోరు 23/0

    నేపాల్ ఓపెన‌ర్లు నిల‌క‌డ‌గా ఆడుతున్నారు. 5 ఓవ‌ర్ల‌కు నేపాల్ స్కోరు 23/0. కుశాల్ బర్టెల్ (12), అసిఫ్‌ షేక్ (7) ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

  • 04 Sep 2023 02:45 PM (IST)

    నేపాల్ తుది జ‌ట్టు

    కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్(వికెట్ కీప‌ర్‌), రోహిత్ పౌడెల్(కెప్టెన్‌), భీమ్ షర్కి, సోంపాల్ కమీ, గుల్సన్ ఝా, దీపేంద్ర సింగ్ ఐరీ, కుశాల్ మల్లా, సందీప్ లామిచానే, కరణ్ కేసీ, లలిత్ రాజ్‌బన్షి

  • 04 Sep 2023 02:44 PM (IST)

    భారత తుది జ‌ట్టు

    రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్(వికెట్ కీప‌ర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

  • 04 Sep 2023 02:43 PM (IST)

    టాస్ గెలిచిన భార‌త్

    ఆసియాక‌ప్ 2023లో భాగంగా ప‌ల్లెక‌లె వేదిక‌గా నేపాల్‌తో భార‌త జ‌ట్టు త‌ల‌ప‌డుతోంది. టాస్ గెలిచిన భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో నేపాల్ తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది. జ‌స్‌ప్రీత్ బుమ్రా వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో స్వ‌దేశానికి రావ‌డంతో అత‌డి స్థానంలో మ‌హ్మ‌ద్ ష‌మిని తీసుకున్నారు. ఈ ఒక్క మార్పు మిన‌హా పాక్‌తో ఆడిన జ‌ట్టుతోనే బ‌రిలోకి దిగుతున్నారు.