IND vs NZ : రాణించిన భారత బౌలర్లు.. భారత్ ముందు ఓ మోస్తరు లక్ష్యం..
IND vs NZ : ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించారు.
- Thota Vamshi Kumar
- Updated on- November 4, 2026 / 11:14 AM IST
IND vs NZ 1st ODI Arshdeep Singh 4 wickets team india target is 186
IND vs NZ : ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించారు. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 40.2 ఓవర్లలో 185 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ ముందు 186 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది.
కివీస్ బ్యాటర్లలో టిమ్ సీఫెర్ట్ (38; 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), బ్లెయిర్ టిక్నర్ (34; 23 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు), గ్లెన్ ఫిలిప్స్ (30; 51 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), డారిల్ మిచెల్ (28; 41 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) లు రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ నాలుగు వికెట్లు తీశాడు. గుర్నూర్ బ్రార్ మూడు వికెట్లు పడగొట్టారు. అన్షుల్ కాంబోజ్ రెండు వికెట్లు సాధించాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా అర్ష్‌దీప్ సింగ్ తన పేస్, స్వింగ్‌తో ఆకట్టుకున్నాడు. అన్షుల్ కాంబోజ్, గుర్నూర్లు బ్రార్‌లు రాణించడంతో కివీస్ ఓ దశలో 115 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఆ జట్టు కనీసం 130 పరుగులైనా చేస్తుందా? అని అనిపించింది. అయితే.. గ్లెఫ్ పిలిప్స్తో పాటు ఆఖరిలో బ్లెయిర్ టిక్నర్ రాణించడంతో 200 పరుగులకు చేరువగా వచ్చింది.
