×
Ad

IND vs NZ 2nd ODI : కివీస్‌తో రెండో వన్డే.. వావ్.. కోహ్లీ, రోహిత్ సహా టీమిండియా క్రికెటర్ల సూపర్ వీడియో వైరల్

IND vs NZ 2nd ODI : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో వన్డే ఇవాళ జరగనుంది. రెండో వన్డేకు ముందు బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో వీడియోను పోస్టు చేసింది.

IND vs NZ 2nd ODI

IND vs NZ 2nd ODI : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో వన్డే ఇవాళ జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పటికే జరిగిన తొలి వన్డేలో భారత జట్టు విజయం సాధించింది. ఇవాళ జరిగే రెండో వన్డేలోనూ విజయం సాధించడం ద్వారా సిరీస్ ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అయితే, తాజాగా బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ వీడియో పోస్టు చేసింది. ఆ వీడియోలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతోపాటు ఇతర టీమిండియా ప్లేయర్లు ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను పోస్టు చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.