IND vs NZ : టాస్ గెలిచిన కివీస్‌.. భార‌త్ బ్యాటింగ్‌.. తుది జ‌ట్టులో రెండు కీల‌క మార్పులు.. భువీ వ‌చ్చేశాడు..

IND vs NZ : భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య హామిల్ట‌న్ వేదిక‌గా ఐదో టీ20 మ్యాచ్ ప్రారంభ‌మైంది.

IND vs NZ 5th T20 New Zealand opt to bowl

IND vs NZ : భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య హామిల్ట‌న్ వేదిక‌గా ఐదో టీ20 మ్యాచ్ ప్రారంభ‌మైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్‌ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భార‌త్‌ తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది. భార‌త జ‌ట్టులో రెండు కీల‌క మార్పులు చోటు చేసుకున్నాయి. అక్ష‌ర్‌ ప‌టేల్‌, మ‌యాంక్ యాద‌వ్ స్థానాల్లో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, భువ‌నేశ్వ‌ర్ కుమార్ లు జ‌ట్టులోకి వ‌చ్చారు.

మ‌రో మూడు రోజుల్లో వ‌న్డే సిరీస్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో మ్యాచ్‌లో విజ‌యం సాధించి ఆత్మ‌విశ్వాసంతో ఆ సిరీస్‌లో అడుగుపెట్టాల‌ని ఇరు జ‌ట్లు భావిస్తున్నాయి.

Glenn Phillips : భార‌త్‌తో ఐదో టీ20 మ్యాచ్‌.. ప్ర‌పంచ రికార్డు పై గ్లెన్ ఫిలిప్స్ క‌న్ను..

‘టాస్‌ ఓడిపోతానని అనుకున్నాను. కానీ గెలిచాము. మేము ముందుగా బౌలింగ్ చేస్తాం. ఇది కొత్త పిచ్. రెండో ఇన్నింగ్స్‌లో మంచు పడే అవకాశం ఉంది. మైదానం బౌండ‌రీల కొల‌త‌ల‌కు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవాలి. ఈడెన్ పార్క్‌లో ఉన్నట్లుగానే ఇందులో కూడా కొంత బౌన్స్ ఉంటే బాగుంటుంది. ఈ సిరీస్ మొత్తంలో బ్యాటింగ్‌లో మేము బాగా రాణించాం. గత మ్యాచ్‌లో పిచ్‌లో బౌలర్లకు (సీమర్లకు) అనుకూలించే అంశాలు ఉండటం మంచి విషయమే. తుది జట్టులో ఓ మార్పు ఉంది. టిక్నర్ తిరిగి వచ్చాడు.’ అని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్న‌ర్ అన్నాడు.


‘ఈ చారిత్రక మైదానానికి రావడం గొప్ప సందర్భం. మేము మొదట బ్యాటింగ్ చేయాలనుకున్నాం. అలా బ్యాటింగ్ చేస్తూ మమ్మల్ని మేము పరీక్షించుకోవాలని భావించాం. ఆక్లాండ్‌లో మైదాన కొలతలు భిన్నంగా ఉన్నాయి. అయితే.. ఫిలిప్స్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు, అతనికి తగిన ప్రశంసలు దక్కాల్సిందే. తుది జట్టులో రెండు మార్పులు ఉన్నాయి. వరుణ్ చ‌క్ర‌వ‌ర్తి, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌ జట్టులోకి వచ్చారు. భువి తన అవకాశం కోసం చాలా కాలంగా వేచి చూస్తున్నాడు. ఈరోజు జట్టు సమావేశంలో (huddle) కూడా అతను చాలా చక్కని ప్రసంగం చేశాడు.’ అని శ్రేయ‌స్ అయ్య‌ర్ తెలిపాడు.

న్యూజిలాండ్ తుది జ‌ట్టు..
టిమ్ సీఫెర్ట్(వికెట్ కీప‌ర్‌), ఫిన్ అలెన్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, బెవాన్ జాకబ్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్‌), నాథన్ స్మిత్, ఆడమ్ మిల్నే, జాకబ్ డఫీ, బ్లెయిర్ టిక్నర్

భార‌త తుది జ‌ట్టు..
సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీప‌ర్‌), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్‌), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వరుణ్ చ‌క్ర‌వ‌ర్తి.