IND vs NZ 5th T20 Sanju Samson lean patch continues
Sanju Samson : టీమ్ఇండియా ఓపెనర్ సంజూ శాంసన్ మరోసారి విఫలం అయ్యాడు. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ మైదానంలో శనివారం న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లోనూ తక్కువ పరుగులే పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 6 బంతులను ఎదుర్కొన్న అతడు ఓ ఫోర్ సాయంతో 6 పరుగులు మాత్రమే చేసి లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో బెవాన్ జాకబ్స్ క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్‌కు చేరుకున్నాడు.
న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్ అన్ని మ్యాచ్‌ల్లోనూ విఫలం అయ్యాడు. కివీస్‌తో సిరీస్‌లో వరుసగా 10, 6, 0, 24, 6 పరుగులు మాత్రమే చేశాడు. అంటే మొత్తంగా 5 మ్యాచ్‌ల్లో 46 పరుగులు మాత్రమే చేశాడు.
Australian Open 2026 : ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ విజేతగా ఎలెనా రిబకినా
టీ20 ప్రపంచకప్ తుది జట్టులో స్థానం కష్టమేనా?
టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు తిలక్ వర్మ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కోలుకున్న అతడు ప్రస్తుతం ఫిట్‌నెస్ సాధించే పనిలో ఉన్నాడు. తన ఫిట్‌నెస్ ను నిరూపించుకుని టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభాని కన్నా ముందే అతడు జట్టులో చేరనున్నాడు.
Sanju Samson dismissed for 6 from 6 balls. pic.twitter.com/jrDxbHTz1U
— Johns. (@CricCrazyJohns) January 31, 2026
కీలక ఆటగాడు అయిన తిలక్ వర్మకు తుది జట్టులో చోటు దక్కడం ఖాయమే. అయితే.. అతడి స్థానంలో కివీస్ టీ20 సిరీస్‌లో ఆడిన ఇషాన్ కిషన్ తనను తాను నిరూపించుకున్నాడు. కొన్ని మెరుపు ఇన్నింగ్స్‌లు సైతం ఆడాడు. దీంతో ఫామ్‌లో ఉన్న అతడిని జట్టు నుంచి తొలగిస్తారా? అన్న సందేహాలు ఉన్నాయి.
WPL 2026 : గుజరాత్ చేతిలో ఓడిపోయినా.. ప్లేఆఫ్స్‌కు చేరేందుకు ముంబైఇండియన్స్‌కు గోల్డెన్ ఛాన్స్!
ఇషాన్ వికెట్ కీపరే కాకుండా ఓపెనింగ్‌లో అద్భుతంగా ఆడగలడు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుంటే జట్టు మేనేజ్‌మెంట్ టీ20 ప్రపంచకప్‌లో సంజూ శాంసన్ స్థానంలో తుది జట్టులో ఇషాన్ కిషన్ ను ఓపెనర్‌గా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే.. భారత్ తరుపున టీ20ల్లో మళ్లీ సంజూను చూడడం కష్టమే.
ఇప్పటికే భారత టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నుంచి అతడికి గట్టి పోటీ ఉంది. పైగా ఇప్పుడు ఇషాన్ కూడా ఉండడంతో సంజూ శాంసన్ కు పెద్దగా ఛాన్స్‌లు రాకపోవచ్చు. ఒకవేళ టీ20 ప్రపంచకప్ తుది జట్టులో శాంసన్‌కు ఆడే అవకాశాలు వస్తే మాత్రం అతడు తప్పక భారీ స్కోర్లు చేయాల్సి ఉంటుంది. లేదంటే ఈ మెగాటోర్నీ తరువాత సంజూను టీ20 జట్టులో చూడడం దాదాపుగా అసాధ్యం.