Champions Trophy : భార‌త్ వ‌ర్సెస్ కివీస్‌ మ్యాచ్‌లో ఆస‌క్తిక‌ర స‌న్నివేశం.. రోహిత్ కొడుకుతో అనుష్క శ‌ర్మ.. వీడియో వైర‌ల్‌

రోహిత్ శ‌ర్మ కొడుకుతో అనుష్క శ‌ర్మ ఉన్న క్యూట్ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కుమారుడు అహాన్‌ను స్టార్ బ్యాట‌ర్ కోహ్లీ భార్య‌, బాలీవుడ్ న‌టి అనుష్క శ‌ర్మ క‌లిసిన‌ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ గా మారింది. ఆదివారం దుబాయ్ వేదిక‌గా భార‌త్‌, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రుగుతుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

కోహ్లీ కెరీర్‌లో మైలుస్టోన్ మ్యాచ్ ఇది. కోహ్లీకి ఇది 300వ వ‌న్డే కావ‌డంతో అనుష్క శ‌ర్మ హాజ‌రైంది. ఇక రోహిత్ శ‌ర్మ భార్య రితికా సజ్దే సైతం త‌న పిల్ల‌ల‌తో మ్యాచ్ చూసేందుకు వ‌చ్చింది. ఈ క్ర‌మంలో రితికాను అనుష్క శ‌ర్మ ప‌ల‌కరించింది. అహాన్ ను చూసి అత‌డి యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంది. కాగా.. అహాన్ ఈ ఏడాది జ‌న‌వ‌రిలో జ‌న్మించాడు. త‌న భార్య రెండో బిడ్డ‌ను జ‌న్మ‌నిస్తుండ‌డంతోనే బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి టెస్టు మ్యాచ్‌కు రోహిత్ శ‌ర్మ దూరం అయిన‌ సంగ‌తి తెలిసిందే.

Champions Trophy: అయ్యయ్యో వద్దు..! అక్షర్ పటేల్ కాళ్లు పట్టుకోబోయిన కోహ్లీ.. నవ్వులేనవ్వులు.. వీడియో వైరల్

ప్ర‌స్తుతం అహాన్‌ను అనుష్క శ‌ర్మ ప‌ల‌కించిన వీడియో వైర‌ల్‌గా మారింది. దీని పై అటు రోహిత్, ఇటు కోహ్లీ ఫ్యాన్స్‌తో పాటు క్రికెట్ అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

కాగా.. గ‌తంలో కోహ్లీ, రోహిత్ శ‌ర్మల మ‌ధ్య విభేదాలు ఉన్న‌ట్లుగా త‌ర‌చూ వార్త‌లు వ‌చ్చేవి. ఈ క్ర‌మంలో అనుష్క‌, రితికా ల మ‌ధ్య మాట‌లు లేవ‌నే ప్ర‌చారం సాగింది. అయితే.. తాజా వీడియోతో వాటి అన్నింటికి ఫుల్ స్టాప్ ప‌డిన‌ట్లే.

Champions Trophy 2025 : ల‌క్కంటే బంగ్లాదేశ్‌దే భ‌య్యా.. ఒక్క మ్యాచ్‌ గెల‌వ‌క‌పోయినా కోట్ల రూపాయ‌లు.. ఇంగ్లాండ్‌, పాక్‌ల‌పై కూడా కోట్ల వ‌ర్షం..

ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్ పై భార‌త్ విజ‌యం సాధించ‌డంతో గ్రూప్‌-ఏలో అగ్ర‌స్థానంలో నిలిచింది. దీంతో సెమీస్‌లో ఆస్ట్రేలియాతో త‌ల‌ప‌డ‌నుంది. దుబాయ్ వేదిక‌గా మార్చి4న (మంగ‌ళ‌వారం) ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైన‌ల్‌కు చేరుకోవ‌డంతో పాటు 2023 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌కు భార‌త్ ఘ‌నంగా ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని స‌గ‌టు టీమ్ఇండియా ఫ్యాన్ కోరుకుంటున్నాడు.