IND vs PAK head to head records in Asia cup
IND vs PAK : క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడూ అని ఎదురుచూస్తున్న భారత్, పాక్ మ్యాచ్‌కు సమయం దగ్గరపడింది. ఆసియాకప్ 2025లో భాగంగా ఆదివారం భారత్, పాక్ జట్లు తలపడనున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ ఘటనలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో భారత్, పాక్ మధ్య మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొన్నాయి.
కాగా.. ఇప్పటి వరకు ఆసియాకప్‌లో భారత్, పాకిస్తాన్ (IND vs PAK ) ఎన్ని సార్లు తలపడ్డాయి. ఎవరిది పైచేయి అన్న విషయాలను ఓ సారి చూద్దాం..
ఆసియాకప్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు 19 సార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో భారత్ 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. పాక్ 6 మ్యాచ్‌ల్లో గెలిచింది. మరో మూడు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.
ఇక టీ20 ఫార్మాట్‌లో ఆసియాకప్‌లో భారత్, పాక్ జట్లు ముఖాముఖిగా మూడు మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో రెండు మ్యాచ్‌ల్లో భారత్ గెలవగా, ఒక మ్యాచ్‌లో పాక్ విజయం సాధించింది. దీంతో భారత్ హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది.
ఆసియాకప్ 1984లో మొదలైంది. ఇప్పటి వరకు 16 ఎడిషన్స్ జరిగాయి. భారత్, పాక్ జట్లు చెరో 15 ఎడిషన్స్‌ల్లోనే పాల్గొన్నాయి. 1986లో భారత్, 1991లో పాక్ ఆసియాకప్‌లలో పాల్గొనలేవు.
Asia Cup 2025 : ప్రారంభమై మూడు రోజులు కాలేదు.. అప్పుడే ఓ జట్టు టోర్నీ నుంచి ఔట్..
ఆసియాకప్‌ను అత్యధిక సార్లు గెలుచుకున్న జట్టుగా టీమ్ఇండియా రికార్డులకు ఎక్కింది. ఇప్పటి వరకు ఏకంగా 8 సార్లు కైవసం చేసుకుంది. ఆ తరువాత 6 సార్లు శ్రీలంక విజేతగా నిలిచి రెండో స్థానంలో ఉంది. ఇక పాకిస్తాన్ రెండు సార్లు మాత్రమే టైటిల్ నెగ్గింది.