IND vs PAK T20 World Cup : ఆడ పులులు అదరహో.. పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం

సౌతాఫ్రికా గడ్డపై జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించారు. పాక్ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని మరో 7 వికెట్లు, 6 బంతులు మిగిలి ఉండగానే భారత మహిళల జట్టు చేజ్ చేసింది.

Ind Vs Pak T20 World Cup : సౌతాఫ్రికా గడ్డపై జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. తాము ఆడ పిల్లలం కాదు ఆడ పులులం అని నిరూపించారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ కు చుక్కలు చూపించారు. దాయాది దేశాన్ని చిత్తు చిత్తుగా ఓడించారు. పాక్ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని మరో 7 వికెట్లు, 6 బంతులు మిగిలి ఉండగానే భారత మహిళల జట్టు చేజ్ చేసింది.

ఓపెనర్లు యస్తికా భాటియా (20 బంతుల్లో 17 పరుగులు), షెఫాలీ వర్మ (25 బంతుల్లో 33 పరుగులు) భారత్ కు మంచి శుభారంభం ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన జమియా రోడ్రిగ్స్ అద్భుతంగా ఆడింది. హాఫ్ సెంచరీతో (53*) అదరగొట్టింది. మరో బ్యాట్స్ ఉమెన్ రిచా ఘోష్ కూడా రాణించింది. వరుసగా 3 ఫోర్లు కొట్టి పాక్ పై ఒత్తిడి పెంచింది. రోడ్రిగ్స్ కూడా ఫోర్లు బాది భారత్ ను విజయతీరాలకు చేర్చింది. వీరిద్దరి జోడీ భారత్ విజయంలో కీ రోల్ ప్లే చేసింది.

Also Read..Rohit Sharma: రోహిత్‌కు కోపమొచ్చింది.. కెమెరా‌మెన్‌పై సీరియస్.. వీడియో వైరల్

రోడ్రిగ్స్ 38 బంతుల్లో 53 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. ఆమె స్కోర్ లో 8 ఫోర్లు ఉన్నాయి. రిచా ఘోష్ 20 బంతుల్లో 31 రన్స్ చేసింది. ఆమె స్కోర్ లో 5 ఫోర్లు ఉన్నాయి.

16 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 4 ఓవర్లలో 41 పరుగులు చేయాల్సి ఉంది. దీంతో అందరిలోనూ కాస్త టెన్షన్ నెలకొంది. ఏం జరుగుతుందోనని కంగారుపడ్డారు. 17వ ఓవర్ లో రోడ్రిగ్స్, రిచా చెరో ఫోర్ కొట్టారు. ఆ తర్వాత 18 ఓవర్ లో రిచా వరుసగా 3 ఫోర్లు బాదింది. 19వ ఓవర్ లో రోడ్రిగ్స్ కూడా 3 ఫోర్లు కొట్టి భారత్ కు మరుపురాని విజయాన్ని అందించారు. ఈ జోడీ 33 బంతుల్లో 58 రన్స్ భాగస్వామ్యం నమోదు చేసి జట్టు గెలుపులో కీ రోల్ ప్లే చేసింది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ ను భారత బౌలర్లు కట్టడి చేశారు. కేప్ టౌన్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 149 పరుగులే చేసింది.

Also Read..Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఐసీసీ షాక్.. వేలికి క్రీమ్ రాసుకున్నందుకు మ్యాచ్ ఫీజులో కోత

పాక్ జట్టు కెప్టెన్ బిస్మా మారూఫ్ హాఫ్ సెంచరీతో రాణించింది. 55 బంతుల్లో 68 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆమె స్కోరులో 7 ఫోర్లు ఉన్నాయి. చివర్లో ఆయేషా నసీమ్ ధాటిగా ఆడడంతో పాక్ కు ఆ మాత్రమైనా స్కోర్ వచ్చింది. ఆయేషా 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 43 పరుగులు చేసింది.(IND vs PAK T20 World Cup)

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

టీమిండియా బౌలర్లలో రాధా యాదవ్ 2 తీసింది. దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ చెరో వికెట్ తీశారు. గ్రూప్ 2లో ఇది నాలుగో మ్యాచ్. కేప్ టౌన్ వేదికగా భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరిగింది.

స్కోర్లు..
పాకిస్తాన్-20 ఓవర్లలో 149/4
భారత్-19 ఓవర్లలో 151/3

టాప్ పెర్ఫార్మర్..

ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..