×
Ad

Hardik Pandya : పాండ్యూ నువ్వు తోపు బ్రో.. అంతర్జాతీయ టీ20ల్లో మరో అరుదైన మైలురాయి..

టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.

IND vs SA 1st T20 Hardik Pandya achieves big milestone

Hardik Pandya : టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. భార‌త్ త‌రుపున టీ20ల్లో 100 సిక్స‌ర్లు బాదాడు. క‌ట‌క్ వేదిక‌గా మంగళ‌వారం ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో నాలుగు సిక్స‌ర్లు కొట్ట‌డం ద్వారా అత‌డు ఈ ఘ‌న‌త అందుకున్నాడు.

టీమ్ఇండియా త‌రుపున టీ20ల్లో 100 సిక్స‌ర్లు మైలురాయిని చేరుకున్న నాలుగో ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. పాండ్యా క‌న్నా ముందు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, సూర్య‌కుమార్ యాద‌వ్ లు ఈ ఘ‌న‌త సాధించారు.

IND vs SA : తొలి టీ20 మ్యాచ్‌లో ఘోర ఓట‌మి.. ‘మేమేందుకు ఓడిపోయామంటే..’ ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ మార్‌క్ర‌మ్ కామెంట్స్..

అంత‌ర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన‌ భారత ప్లేయ‌ర్లు వీరే..

* రోహిత్ శర్మ- 151 ఇన్నింగ్స్‌లలో 205 సిక్సర్లు
* సూర్యకుమార్ యాదవ్ – 90 ఇన్నింగ్స్‌ల్లో 155 సిక్సర్లు
* విరాట్ కోహ్లీ – 117 ఇన్నింగ్స్‌లలో 124 సిక్సర్లు
* హార్దిక్ పాండ్యా – 95 ఇన్నింగ్స్‌లలో 100 సిక్సర్లు
కేఎల్ రాహుల్ – 68 ఇన్నింగ్స్‌లలో 99 సిక్సర్లు

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. పాండ్యా హాఫ్ సెంచ‌రీతో రాణించ‌డంతో (59 నాటౌట్‌; 28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ 6 వికెట్లు కోల్పోయి 175 ప‌రుగులు సాధించింది. స‌ఫారీ బౌల‌ర్ల‌లో లుంగి ఎంగిడి మూడు వికెట్లు, లుథో సిపామ్లా రెండు వికెట్లు, డోనోవన్ ఫెర్రీరా ఓ వికెట్ తీశాడు.

IPL 2026 Auction : ఐపీఎల్ 2026 మినీ వేలం.. షార్ట్ లిస్ట్‌లో ఉన్న క్యాప్డ్ ప్లేయ‌ర్లు వీరే.. ఎవ‌రి బేస్ ప్రైజ్ ఎంతంటే?

ఆ త‌రువాత భార‌త బౌల‌ర్లు విజృంభించ‌డంతో 176 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో ద‌క్షిణాఫ్రికా 12.3 ఓవ‌ర్ల‌లో 74 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. స‌ఫారీ బ్యాట‌ర్ల‌లో డెవాల్డ్ బ్రెవిస్ (22), ట్రిస్టన్ స్టబ్స్ (14), ఐడెన్ మార్‌క్ర‌మ్ (14), మార్కో జాన్సెన్ (12) లు మాత్ర‌మే రెండు అంకెల స్కోరు సాధించారు. టీమ్ఇండియా బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్, జ‌స్‌ప్రీత్ బుమ్రా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, అక్ష‌ర్ ప‌టేల్ లు త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. హార్దిక్ పాండ్యా, శివ‌మ్ దూబెలు చెరో వికెట్ తీశారు.