×
Ad

IND vs SA : సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్‌.. కెరీర్ మైల్‌స్టోన్ పై సంజూ శాంస‌న్ క‌న్ను..

సౌతాఫ్రికా, టీమ్ఇండియా జ‌ట్ల మ‌ధ్య (IND vs SA ) మంగ‌ళ‌వారం (డిసెంబ‌ర్ 9) నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.

IND vs SA 1st T20 Sanju Samson need 5 to 1000 international T20runs

IND vs SA : సౌతాఫ్రికా, టీమ్ఇండియా జ‌ట్ల మ‌ధ్య మంగ‌ళ‌వారం (డిసెంబ‌ర్ 9) నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టీ20 మ్యాచ్‌కు క‌ట‌క్‌లోని బారాబ‌తి స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్‌ను కెరీర్ మైల్‌స్టోన్ ఊరిస్తోంది.

ఈ మ్యాచ్‌లో సంజూ శాంస‌న్ 5 ప‌రుగులు చేస్తే.. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో వెయ్యి ప‌రుగుల మెలురాయిని చేరుకుంటాడు. ఈ మ్యాచ్‌లోనే సంజూ ఈ రికార్డు అందుకోవాల‌ని అత‌డి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

IND vs SA : ద‌క్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌.. టాస్ గెలిచేందుకు సూర్య‌కుమార్ యాద‌వ్ మాస్ట‌ర్ ప్లాన్‌..

2015లో అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు సంజూ శాంస‌న్‌. ఇప్ప‌టి వ‌ర‌కు 51 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 43 ఇన్నింగ్స్‌ల్లో 25.5 స‌గ‌టుతో 995 ప‌రుగులు సాధించాడు. ఇందులో మూడు శ‌త‌కాలు, మూడు అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. శుభ్‌మ‌న్ గిల్ టీ20ల్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌డంతో సంజూ శాంస‌న్ మిడిల్ ఆర్డ‌ర్‌కు ప‌రిమితం అయ్యాడు. అయితే.. ఓపెన‌ర్‌గా రాణించిన సంజూ అక్క‌డ మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక‌పోయాడు. దీంతో అక్టోబ‌ర్‌లో ఆసీస్‌తో జ‌రిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివ‌రి మూడు మ్యాచ్‌ల‌కు అత‌డిని తుది జ‌ట్టు నుంచి త‌ప్పించి జితేశ్ శ‌ర్మ‌కు ఛాన్స్ ఇచ్చారు.

ICC : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు ఐసీసీకి జియో హాట్‌స్టార్ భారీ షాక్..!

ఈ నేప‌థ్యంలో ద‌క్షిణాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్‌లో సంజూ శాంస‌న్ తుది జ‌ట్టులో చోటు ద‌క్కించుకుంటాడో లేదో చూడాల్సిందే.