IND vs SA : ద‌క్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌.. టాస్ గెలిచేందుకు సూర్య‌కుమార్ యాద‌వ్ మాస్ట‌ర్ ప్లాన్‌..

భార‌త్, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య ఐదు మ్యాచ్‌ల (IND vs SA) టీ20 సిరీస్ డిసెంబ‌ర్ 9 (మంగ‌ళ‌వారం) నుంచి ప్రారంభం కానుంది.

IND vs SA : ద‌క్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌.. టాస్ గెలిచేందుకు సూర్య‌కుమార్ యాద‌వ్ మాస్ట‌ర్ ప్లాన్‌..

IND vs SA T20 series Suryakumar Yadav reveals he will use KL Rahul toss Trick

Updated On : December 8, 2025 / 7:14 PM IST

IND vs SA : భార‌త్, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ డిసెంబ‌ర్ 9 (మంగ‌ళ‌వారం) నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌కు క‌ట‌క్‌లోని బారాబ‌తి స్టేడియం ఆతిథ్యం ఇవ్వ‌నుంది. ఇప్ప‌టికే భార‌త్, సౌతాఫ్రికా జ‌ట్లు క‌ట‌క్ కు చేరుకున్నాయి. తొలి మ్యాచ్ కోసం ప్లేయ‌ర్లు నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల కాలంలో భారత జ‌ట్టుకు టాస్ క‌లిసి రావ‌డం లేదు. చాలా మ్యాచ్‌ల్లోనూ టాస్ ఓడిపోయింది. వ‌రుస‌గా 20 వ‌న్డే మ్యాచ్‌ల్లోనూ టాస్ ఓడిపోయిన భార‌త్ విశాఖ వేదిక‌గా దక్షిణాఫ్రికాతో జ‌రిగిన మూడో వ‌న్డే మ్యాచ్‌లో మాత్రం గెలిచింది. స్టాండ్ ఇన్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో విచిత్రంగా త‌న ఎడ‌మ‌చేతితో కాయిన్ ను ప్లిప్ చేశాడు. ఈ క్ర‌మంలో టాస్ ల ఓట‌మికి అత‌డు ముగింపు ప‌లికాడు.

IND vs SA : ద‌క్షిణాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్‌.. సూర్య‌కుమార్ యాద‌వ్ చ‌రిత్ర సృష్టించేనా?

తొలి టీ20 మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్య‌కుమార్ మీడియా స‌మావేశంలో పాల్గొన్నాడు. టాస్ లు ఓడిపోవ‌డం పై సూర్య‌కు ప్ర‌శ్న ఎదురైంది. దీనిపై అత‌డు మాట్లాడుతూ.. కేఎల్ రాహుల్ లాగానే తాను కూడా ద‌క్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ లో ఎడ‌మ చేతితో కాయిన్‌ను ప్లిప్ చేస్తాన‌ని తెలిపాడు.

సూర్య‌కుమార్ యాద‌వ్ ఎన్ని మ్యాచ్‌ల్లో టాస్ ఓడిపోయాడంటే..?

సూర్య‌కుమార్ యాద‌వ్ ఇప్ప‌టి వ‌ర‌కు 34 మ్యాచ్‌ల్లో టీమ్ఇండియాకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఇందులో 13 మ్యాచ్‌ల్లోనే అత‌డు టాస్ గెలిచాడు. మ‌రో 21 మ్యాచ్‌ల్లో అత‌డు టాస్ ఓడిపోయాడు. అత‌డి టాస్ గెలుపు శాతం 38.24గా ఉంది. ఈ క్ర‌మంలో రాహుల్ ట్రిక్ ను ఉప‌యోగించి అత‌డు త‌న టాస్ రికార్డును మెరుగుప‌ర‌చుకోవాల‌ని అనుకుంటున్నాడు.

IND vs SA : మంగ‌ళ‌వారం నుంచే టీ20 సిరీస్‌.. ఫ్రీగా ఎక్క‌డ చూడొచ్చొ తెలుసా?