IND vs SA 5th 20 Suryakumar Yadav comments after India win the series against south africa
IND vs SA : దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 3-1తో కైవసం చేసుకుంది. శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో భారత్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ తరువాత సిరీస్ సాధించడం పట్ల టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
సిరీస్ ప్రారంభం నుంచి తాము దూకుడైన క్రికెట్ ఆడాలని అనుకున్నామని, అలాగే ఆడామని చెప్పాడు. రొటీన్ కు భిన్నంగా తామేమీ ప్రయత్నించలేదన్నాడు. అన్ని విభాగాల్లో సత్తా ను చాటాలని అనుకున్నాము. ఆ ఫలితాలు అందరి కళ్ల ముందు ఉన్నాయన్నాడు. ‘దూకుడైన బ్యాటింగ్ చేయాలని అనుకున్నాము. గత కొన్ని సిరీస్‌లలో మాలో లోపించి ఇదే. ఒక్కసారి జోరు అందుకుంటే బ్యాటర్లు ఆగరు. నిరంతరం దూకుడుగా ఆడాలని కోరుకుంటాము. ఈ రోజు అది అద్భుతంగా ఫలించింది.’ అని సూర్య తెలిపాడు.
బౌలింగ్ వ్యూహాలపై మాట్లాడుతూ.. తాము పవర్ ప్లేలో, మిడిల్, డెత్ ఓవర్లలో ప్రణాళికల ప్రకారం బౌలర్లను ఉపయోగించుకున్నామన్నాడు. ఇక వాషింగ్టన్ సుందర్‌ను మెచ్చుకున్నాడు. ఈ రోజు అతడు చాలా బాగా రాణించాడన్నారు. సిరీస్ మొత్తంలో తాము ఏం చేయాలని అనుకున్నామో అన్నింటిని సాధించామన్నాడు.
‘అయితే.. సిరీస్‌లో తాము సాధించలేని ఏకైక విషయం ఏమిటంటే.. దూకుడుగా ఆడే సూర్య అనే బ్యాటర్ నే. అతడెక్కడో మిస్ అయ్యాడు. కానీ కచ్చితంగా బలంగా తిరిగి వస్తాడు.’ అని సూర్యకుమార్ యాదవ్ నవ్వుతూ తన గురించి తానే చెప్పుకున్నాడు.
Sanju Samson : సంజూ శాంసన్ అరుదైన ఘనత.. 10 ఏళ్లు పట్టింది.. ఏడాదికి ఓ వంద..
గత కొంత కాలంగా సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. ఈ సిరీస్‌లోనూ అతడు పేలవ ప్రదర్శన చేశాడు. వరుసగా 12, 5, 12, 5 పరుగులు మాత్రమే సాధించాడు.