×
Ad

IND vs SA : వామ్మో భార‌త ఆట‌గాళ్లు.. సంజూ అంపైర్‌ను, హార్దిక్ కెమెరామన్‌ను.. వీడియోలు..

అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర‌మోదీ స్టేడియం వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన టీ20 మ్యాచ్‌లోనూ (IND vs SA ) టీమ్ఇండియా ఆట‌గాళ్లు అదే దూకుడును కొన‌సాగించారు

IND vs SA 5th T20 Team India players batting ball hits umpire and cameraman

IND vs SA : గ‌తకొంత‌కాలంగా టీమ్ఇండియా ఆట‌గాళ్లు దూకుడైన ఆట‌తీరు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ముఖ్యంగా టీ20ల్లో అయితే వారి దూకుడు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. శుక్ర‌వారం అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర‌మోదీ స్టేడియం వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన టీ20 మ్యాచ్‌లోనూ అదే దూకుడును కొన‌సాగించారు. కాగా.. భార‌త ప్లేయ‌ర్ల దూకుడైన బ్యాటింగ్ కార‌ణంగా అంపైర్‌, కెమెరామెన్‌ల‌కు గాయాలు అయ్యాయి.

ఏం జ‌రిగిందంటే..?

టాస్ ఓడిన భార‌త్ బ్యాటింగ్‌కు దిగింది. శుభ్‌మ‌న్ గిల్ గైర్జాజ‌రీలో రాక రాక వ‌చ్చిన అవ‌కాశాన్ని సంజూ శాంస‌న్ అద్భుతంగా ఒడిసి ప‌ట్టుకున్నాడు. కేవ‌లం 22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్ల సాయంతో 37 ప‌రుగులు సాధించాడు. అయితే.. అత‌డు కొట్టిన ఓ బంతి అంపైర్ కాలిని బ‌లంగా తాకింది.

IND vs SA : సూర్య‌కుమార్ యాద‌వ్ కామెంట్స్‌.. సిరీస్ గెలిచాం కానీ.. అదొక్క‌టే ..

ఈ ఘ‌ట‌న భార‌త ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవ‌ర్‌లో చోటు చేసుకుంది. డొనోవన్‌ ఫెరీరా ఈ ఓవ‌ర్‌ను వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని ఓ బంతిని సంజూ శాంస‌న్ స్ట్రెయిట్ డైవ్ ఆడాడు. అయితే.. ఆ బంతిని బౌల‌ర్ డొనోవ‌న్ ఫెరీరా ఆపే ప్ర‌య‌త్నం చేశాడు. బంతి అత‌డి చేతిని తాకి ఫీల్డ్ అంపైర్ రోహ‌న్ పండిట్ కుడి కాలిని బ‌లంగా తాకింది. దీంతో నొప్పితో అంపైర్ విల‌విల‌లాడాడు.

Sanju Samson : సంజూ శాంస‌న్ అరుదైన‌ ఘ‌న‌త‌.. 10 ఏళ్లు ప‌ట్టింది.. ఏడాదికి ఓ వంద‌..

బంతి తాకిన వెంట‌నే నొప్పితో అత‌డు మైదానంలో కింద ప‌డుకుండిపోయాడు. ప్రాథమిక చికిత్స అనంత‌రం కాస్త కోలుకుని త‌న విధుల‌ను నిర్వ‌ర్తించాడు.

కెమెరాన్‌ను తాకిన బంతి..

ఇక ఇన్నింగ్స్ 13వ ఓవ‌ర్‌ను కార్బిన్ బోష్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని ఓ బంతిని టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్‌ హార్దిక్ పాండ్యా మిడాఫ్ దిశ‌గా సిక్స్ కొట్టాడు. అయితే.. బంతి బౌండ‌రీ లైన్ ఆవ‌ల విధుల్లో ఉన్న కెమెరామన్ చేతిని తాకింది. వెంట‌నే భార‌త ఫిజియో వచ్చి అతనికి పెయిన్ రిలీఫ్ స్ప్రే చేసిన‌ప్ప‌టికి కూడా నొప్పి త‌గ్గ‌క‌పోవ‌డంతో ఐస్ బ్యాగ్ పెట్టుకున్నాడు.

IND vs SA : ఐదో టీ20లో ఓట‌మి.. దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్‌క్ర‌మ్ సంచల‌న వ్యాఖ్య‌లు.. సిరీస్ పోతే పోయింది.. మా ల‌క్ష్యం అదొక్క‌టే..

అయితే.. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన హార్దిక్ పాండ్యా భార‌త ఇన్నింగ్స్ ముగిసిన త‌రువాత ఫీల్డింగ్‌కు వెళ్లేముందు కెమెరామ‌న్‌ వ‌ద్ద‌కు వెళ్లాడు. అత‌డికి క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డంతో పాటు హ‌గ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.