×
Ad

Ind Vs SA: సౌతాఫ్రికాపై భారత్ ఘన విజయం.. టీ20 సిరీస్ కైవసం

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి..

Ind Vs SA: 5వ టీ20 మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది. సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించింది. 30 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. ఈ గెలుపుతో టీ20 సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు రాణించారు. సౌతాఫ్రికాను కట్టడి చేశారు.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. 232 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి చెలరేగాడు. 4 వికెట్లు తీసి సౌతాఫ్రికాను దెబ్బకొట్టాడు. బుమ్రా 2 వికెట్లతో రాణించాడు. అర్ష్‌దీప్‌సింగ్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ పడగొట్టారు.

భారత జట్టులో తిలక్ వర్మ(73), హార్దిక్ పాండ్యా(63) హాఫ్ సెంచరీలో చెలరేగారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా సెన్సేషనల్ బ్యాటింగ్ చేశాడు. సౌతాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు. పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలో 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పాండ్యా మెరుపు బ్యాటింగ్ తో భారత్ భారీ స్కోర్ చేసింది.

సౌతాఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్ డికాక్ (65), బ్రెవిస్ (31) మాత్రమే రాణించారు. ఒకానొక సమయంలో డికాక్ భారత్ ను భయపెట్టాడు. ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. డికాక్ దంచికొట్టడతో తొలి 10 ఓవర్లలో 118 రన్స్ చేసింది సౌతాఫ్రికా. డికాక్ ఔట్ కావడంతో సౌతాఫ్రికా తడబడింది. వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది.

Also Read: మ్యాచ్ లే స్టార్ట్ కాలేదు.. అప్పుడే టాప్ 4 అంట..