IND vs SA Head to Head Record
IND vs SA Head to Head Record : వన్డే ప్రపంచకప్‌లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ మెగాటోర్నీలో వరుస విజయాలతో టీమ్ఇండియా దూసుకుపోతుంది. ఆడిన ఏడు మ్యాచుల్లోనూ విజయం సాధించి ఓటమే ఎగురని జట్టుగా నిలిచింది. మరోవైపు దక్షిణాఫ్రికా కూడా ఏడు మ్యాచులు ఆడగా ఒక్క మ్యాచులో మాత్రమే ఓడి ఆరింటిలో గెలుపొందింది. అయితే.. ఆ ఓటమి నెదర్లాండ్స్ చేతిలో కావడం గమనార్హం.
పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన భారత్, దక్షిణాఫ్రికా మధ్య పోరు జరగనుండడంతో మ్యాచ్ హోరాహోరీగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు భారత్, సౌతాఫ్రికా జట్లు వన్డే ప్రపంచకప్‌లో ఎన్ని సార్లు తలపడ్డాయి. వీటిలో ఎక్కువ మ్యాచ్‌లు గెలిచింది ఎవరు..? వంటి విషయాలను ఓ సారి చూద్దాం..
భారత్, దక్షిణాఫ్రికా జట్లు వన్డేల్లో ఇప్పటి వరకు 90 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 50 మ్యాచుల్లో గెలుపొందగా, దక్షిణాఫ్రికా 37 మ్యాచుల్లో విజయం సాధించింది. 3 మ్యాచుల్లో ఫలితం తేలలేదు. ఇక వన్డే ప్రపంచకప్ మ్యాచుల విషయానికి వస్తే.. ఇరు జట్లు ఇప్పటి వరకు 5 సార్లు తలపడ్డాయి. ఇందులో దక్షిణాఫ్రికా మూడు మ్యాచుల్లో విజయం సాధించగా, భారత్ రెండు మ్యాచుల్లో గెలిచింది. 2003 నుంచి 2019 వరకు వరల్డ్ కప్లో గెలుపు ఓటములు చూసుకుంటే.. 3 సార్లు ఇరు జట్లు తలపడ్డాయి. ఇందులో రెండు టీమిండియా గెలుపొందగా, ఓ మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించింది.
చూడాలి.. మరీ ఈ ప్రపంచకప్‌లో భారత వరుస విజయాల జైత్ర యాత్రకు సౌతాఫ్రికా బ్రేక్ వేస్తుందా..? లేక టీమ్ఇండియా తన గెలుపు యాత్ర కొనసాగుతుందో.
Shaheen Afridi : 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో.. ఓ పాకిస్థాన్ బౌలర్ చెత్త రికార్డు ఇదే..