Ind Vs SA : చెలరేగిన భారత్.. సౌతాఫ్రికా ఆలౌట్.. 146 రన్స్ లీడ్‌లో టీమిండియా

సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ బౌలర్లు అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికాను 197 పరుగులకే ఆలౌట్ చేశారు.

Ind Vs Sa

Ind Vs SA : సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ బౌలర్లు అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికాను 197 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ చెలరేగాడు. 5 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా వెన్ను విరిచాడు. ఈ మ్యాచ్ లో 5 వికెట్లు పడగొట్టిన షమీ.. టెస్టుల్లో 200 వికెట్ల మైలురాయిని అధిగమించాడు. శార్దూల్ ఠాకూర్, జస్ ప్రీత్ బుమ్రా చెరో రెండు వికెట్లు తీశారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో బవుమా(52) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. కాగా, తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 130 పరుగుల ఆధిక్యం దక్కింది.

New E-cycles from Hero: దేశంలోనే మొట్టమొదటిసారిగా బ్లూటూత్ తో వచ్చిన సైకిల్

తొలి టెస్టు మ్యాచ్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. క్రీజ్‌లో కేఎల్ రాహుల్ (5), శార్దూల్‌ (4*) ఉన్నారు. 130 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్.. మయాంక్ అగర్వాల్(4) రూపంలో తొలి వికెట్‌ను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 130తో కలుపుకుని ఇప్పటి వరకు కోహ్లి గ్యాంగ్ 146 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులు చేయగా.. దక్షిణాఫ్రికా 197 పరుగులకు ఆలౌటైంది.