Virat Kohli Subhan 10tv
IND vs SL:విరాట్ కోహ్లీ మరోసారి భారీ స్కోరు మిస్సయ్యాడు. శుక్రవారం జరిగిన ఇండియా – శ్రీలంకల మధ్య మ్యాచ్ కోహ్లీ కెరీర్ లో వందో టెస్టు మ్యాచ్. దీనిపై క్రికెట్ లెజెంట్స్ నుంచి అభినందనలు అందుకున్న కోహ్లీ.. భారీ స్కోరు నమోదు చేస్తాడనే అంచనాలు నెలకొన్నాయి. వీటన్నిటినీ పటాపంచలు చేస్తూ హాఫ్ సెంచరీ కూడా చేయకుండానే అవుట్ అయ్యాడు.
2019 టైంలో ఉన్నంత ఫామ్ ఇప్పుడు కనిపిస్తుండకపోవడం గమనార్హం. అయితే శుక్రవారం జరిగే మ్యాచ్ లో కోహ్లీ బ్యాటింగ్ పరుగులు ఎన్ని చేస్తాడని ఓ నెటిజన్ ముందుగానే చెప్పేసింది.
‘కోహ్లీ వందో టెస్టులో వంద పరుగులు చేయలేడు. కేవలం 45పరుగులు మాత్రమే నమోదు చేస్తాడు. నాలుగు అద్భుతమైన కవర్ డ్రైవ్‌లు ఆడి ఎంబుల్డెనియా చేతుల్లో స్టంప్స్ ముందు అవుట్ అయిపోయి షాక్ అయినట్లు యాక్ట్ చేస్తాడు. దాంతో పాటు మొహంపై అసంతృప్తితో ఉన్నట్లు రియాక్షన్ వస్తుంది’ అంటూ తెల్లవారితే శుక్రవారం అనగా అర్ధరాత్రి 12గంటల 46నిమిషాలకే పోస్టు చేశారు.
Read Also : కోహ్లీకి ద్రవిడ్ సన్మానం.. పక్కనే ఉన్న అనుష్క
అంతా చెప్పినట్లే జరగడంతో ఈ ట్వీట్ ట్రెండ్ కావడంతో పాటు ఇప్పటికే 5వేల రీట్వీట్లు, 15వేల లైక్‌లు దక్కించుకుంది.
వందో టెస్టు ఆడిన కోహ్లీ టెస్ట్ క్రికెట్ లో 8వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత దక్కించుకున్న ఆరో ఇండియన్ క్రికెటర్ గా నిలిచాడు.
మ్యాచ్ జరగడానికి ముందు వంద టెస్టులు ఆడిన కోహ్లీకి కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతుల మీదుగా టీమ్ మేట్స్, అనుష్క శర్మ, బీసీసీఐ అధికారుల సమక్షంలో స్పెషల్ క్యాప్ ఇచ్చి సత్కరించారు.