Ind vs WI 2nd test
జైస్వాల్, రోహిత్ శర్మ ఫిప్టీ..
వెస్టిండీస్ తో రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ కొనసాగుతోంది. 42 ఓవర్లు ముగిసే సమయానికి భారత జట్టు 3 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (57), కెప్టెన్ రోహిత్ శర్మ(80) హాఫ్ సెంచరీలతో రాణించారు. శుభ్ మన్ గిల్(10) తక్కువ స్కోరు ఔటై నిరాశపరిచాడు. క్రీజులో విరాట్ కోహ్లి, అజింక్య రహానె ఉన్నారు.
లంచ్ బ్రేక్.. టీమ్ఇండియా 121 0
రెండో టెస్టులోనూ భారత్ అదరగొడుతోంది. మొదటి రోజు లంచ్ విరామానికి భారత్ వికెట్ నష్టపోకుండా 121 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 63, యశస్వి జైస్వాల్ 52 పరుగులతో క్రీజులో ఉన్నారు.
వరుసగా అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు సాధించిన భారత ఓపెనింగ్ జోడీలు
సెహ్వాగ్, మురళివిజయ్ – 3
సునీల్ గావస్కర్, ఫరోఖ్ ఇంజినీర్ – 2
సునీల్ గావస్కర్, అన్షుమన్ గైక్వాడ్ – 2
సునీల్ గావస్కర్, అరుణ్ లాల్ -2
ఎస్.రమేశ్, దేవంగ్ గాంధీ -2
రోహిత్ శర్మ, యశస్విజైస్వాల్ -2
జైశ్వాల్ హాఫ్ సెంచరీ
యువ ఆటగాడు జైశ్వాల్ అదరగొడుతున్నాడు. రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 49 బంతుల్లో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇందులో 8 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి.
సిక్స్‌తో రోహిత్ శర్మ అర్థశతకం
రోహిత్ శర్మ తన ఫామ్‌ను కొనసాగిస్తాడు. మొదటి టెస్టులో సెంచరీ చేసిన రోహిత్ శర్మ రెండో టెస్టులో అర్ధశతకం చేశాడు. కీమర్ రోచ్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి 74 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 1 సిక్స్ ఉంది.
భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, అజింక్య రహానె, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జయ్‌దేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్
వెస్టిండీస్ జట్టు : క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), టగ్ నారాయణ్ చంద్రపాల్, అథనేజ్, బ్లాక్‌వుడ్, కిర్క్ మెకంజీ, హోల్డర్, జాషువా ద సిల్వా, అల్జారి జోసెఫ్, కీమర్ రోచ్, గాబ్రియల్, వారికన్.
భారత, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. ఇరు జట్ల మధ్య ఇది వందో టెస్టు మ్యాచ్ కావడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు టాస్ గెలిచింది. బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట బ్యాటింగ్ చేయనుంది. తొలి టెస్టు ఆడిన జట్టులో ఒకే ఒక మార్పుతో టీమ్ఇండియా బరిలోకి దిగింది. శార్దూల్ ఠాకూర్ స్థానంలో యువ ఆటగాడు ముకేశ్ కుమార్‌కు చోటు ఇచ్చింది. ఈ మ్యాచ్ ద్వారా ముకేశ్ కుమార్ టెస్టుల్లో అరంగ్రేటం చేస్తున్నాడు.