Ind Vs Wi
విజయానికి 8 వికెట్ల దూరంలో బారత్
రెండో టెస్టులో టీమ్ఇండియా పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్‌లో 24 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో వెస్టిండీస్ ముందు 365 పరుగుల లక్ష్యం నిలిచింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది.
వర్షం.. ఆగిన ఆట.. లంచ్ బ్రేక్
రోహిత్ శర్మ ఔట్ కాగానే వర్షం మొదలైంది. దీంతో మ్యాచ్ ఆగిపోయింది. ఆటగాళ్లు గ్రౌండ్‌ను వీడారు. దీంతో ముందుగానే లంచ్ బ్రేక్‌ను తీసుకున్నారు అంపైర్లు. ప్రస్తుతం టీమ్ఇండియి స్కోరు 98/1. యశస్వి జైశ్వాల్ (37), శుభ్‌మన్ గిల్(0) లు క్రీజులో ఉన్నారు.
రోహిత్ శర్మ ఔట్
రెండో ఇన్నింగ్స్‌లో భారత్ మొదటి వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ(57) గాబ్రియల్ బౌలింగ్‌లో జోసెఫ్ చేతికి చిక్కాడు. దీంతో 98 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ పడింది.
రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ
వెస్టిండీస్‌ను ఆలౌట్ చేసిన అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత జట్టు దూకుడుగా ఆడుతోంది. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, రోహిత్ శర్మ టీ20 తరహాలో బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రోహిత్ 35 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అటు జైశ్వాల్ కూడా 21 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 30 పరుగులతో ఆడుతున్నాడు. 10 ఓవర్లకు భారత స్కోరు 90/0.
వెస్టిండీస్ 255 ఆలౌట్.. టీమ్ఇండియాకు భారీ ఆధిక్యం
పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో టీమ్ఇండియా జరుగుతున్న రెండో టెస్టులో విండీస్ మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. 255 పరుగులకు ఆలౌటైంది. వెస్టిండీస్ బ్యాటర్లలో కెప్టెన్ బ్రాత్ వైట్(75)తో రాణించగా టగ్ నరైన్ చంద్రపాల్ (33), మెకంజీ(32)లు ఫర్వాలేదనించారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ ఐదు వికెట్లు తీయగా, ముకేశ్ కుమార్, రవీంద్ర జడేజా చెరో రెండు, రవిచంద్రన్ అశ్విన్ ఓ వికెట్ పడగొట్టాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌కు 183 పరుగుల ఆధిక్యం లభించింది.
తొమ్మిదో వికెట్ కోల్పోయిన విండీస్
విండీస్ మరో వికెట్ కోల్పోయింది. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో రోచ్(4) వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ చేతికి చిక్కాడు. దీంతో విండీస్ 255 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది.
జోసెఫ్ ఔట్
విండీస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతుంది. సిరాజ్ బౌలింగ్‌లో జోసెఫ్(4) ఎల్బీగా ఔట్ అయ్యాడు. మొదట అంపైర్ నాటౌట్‌గా ప్రకటించగా కెప్టెన్ రోహిత్ శర్మ డీఆర్ఎస్‌కు వెళ్లాడు. అందులో ఔట్ అని తేలడంతో విండీస్ 244 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది.
హోల్డర్ ఔట్
విండీస్ మరో వికెట్ కోల్పోయింది. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ క్యాచ్ అందుకోవడంతో జేసన్ హోల్డర్(15) ఔట్ అయ్యాడు. దీంతో విండీస్ 233 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది.
మొదటి ఓవర్‌లోనే వికెట్
నాలుగో రోజు ఆట ఆరంభమైన మొదటి ఓవర్‌లోనే విండీస్ వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో అథనేజ్(37) ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో విండీస్ 229 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది.
ప్రారంభమైన ఆట
టీమ్ఇండియా, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. ఓవర్ నైట్ స్కోరు 229/5 తో విండీస్ ఆటను కొనసాగిస్తోంది. క్రీజులో జేసన్ హోల్డర్ (11), అథనేజ్ (37) లు ఉన్నారు.