Tilak Varma : వెస్టిండీస్‌తో మూడో టీ20 మ్యాచ్.. అరుదైన మైలురాయికి చేరువలో తిలక్ వర్మ..
భారత్, వెస్టిండీస్ మూడో టీ20 మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు, తెలుగు తేజం తిలక్ వర్మను ఓ అరుదైన మైలురాయి ఊరిస్తోంది.
- Thota Vamshi Kumar
- Published on- October 11, 2026 / 01:20 PM IST
IND vs WI 3rd T20 match Today Tilak Varma Need 10 More To Complete 100 Sixes In International T20Is
Tilak Varma : ఇండోర్ వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నేడు (అక్టోబర్ 11)న మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు, తెలుగు తేజం తిలక్ వర్మను ఓ అరుదైన మైలురాయి ఊరిస్తోంది.
తిలక్ వర్మ 2023లో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. ఇప్పటి వరకు అతడు 67 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 146.6 స్ట్రైక్‌రేటు, 45.2 సగటుతో 1763 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, 10 అర్థశతకాలు ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు 134 ఫోర్లు, 90 సిక్సర్లు కొట్టాడు.
Sanju Samson : వెస్టిండీస్‌తో మూడో టీ20 మ్యాచ్.. సంజూ శాంసన్‌ను ఊరిస్తున్న భారీ రికార్డు..
మరో 10 సిక్సర్లు కొడితే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 100 సిక్సర్ల మైలురాయిని చేరుకుంటాడు. భారత్ తరుపున ఇప్పటి వరకు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీలు మాత్రమే 100 సిక్సర్లు బాదారు. వీరిలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఒక్కడే 200 సిక్సర్ల క్లబ్‌లోనూ చోటు సంపాదించుకున్నాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్లు వీరే..
* రోహిత్ శర్మ – 159 మ్యాచ్‌ల్లో 205 సిక్సర్లు
* సూర్యకుమార్ యాదవ్ – 113 మ్యాచ్‌ల్లో 179 సిక్సర్లు
* అభిషేక్ శర్మ – 64 మ్యాచ్‌ల్లో 136 సిక్సర్లు
* హార్దిక్ పాండ్యా – 138 మ్యాచ్‌ల్లో 126 సిక్సర్లు
* విరాట్ కోహ్లీ – 125 మ్యాచ్‌ల్లో 124 సిక్సర్లు
* కేఎల్ రాహుల్ – 72 మ్యాచ్‌ల్లో 99 సిక్సర్లు
* సంజూ శాంసన్ – 74 మ్యాచ్‌ల్లో 98 సిక్సర్లు
*తిలక్ వర్మ – 67 మ్యాచ్‌ల్లో 90 సిక్సర్లు
