Tilak Varma : చరిత్ర సృష్టించిన తెలుగు తేజం తిలక్ వర్మ.. టీ20 క్రికెట్లో ఏకైక ఆటగాడు..
టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు, తెలుగు తేజం తిలక్ వర్మ (Tilak Varma ) అరుదైన ఘనత సాధించాడు.
Tilak Varma Only one batter in T20 history has aggregated 5000 plus at an average of 40 plus strike rate of 140 plus
Tilak Varma : టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు, తెలుగు తేజం తిలక్ వర్మ అరుదైన ఘనత సాధించాడు. రాంచి వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో కేవలం 18 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 44 పరుగుతో అజేయంగా నిలిచాడు. ఈక్రమంలో టీ20 క్రికెట్లో 5 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా 5వేల పరుగుల మైలురాయిని చేరుకున్న ఐదో భారత ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఈ జాబితాలో కేఎల్ రాహుల్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు 143 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఆ తరువాత రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మలు ఉన్నారు.
టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా 5000 పరుగులు చేసిన టాప్-5 భారత బ్యాటర్లు వీరే..
* కేఎల్ రాహుల్ – 143 ఇన్నింగ్స్‌ల్లో
* రుతురాజ్ గైక్వాడ్ -145 ఇన్నింగ్స్‌ల్లో
* శుభ్‌మన్ గిల్ – 154 ఇన్నింగ్స్‌ల్లో
* అభిషేక్ శర్మ – 165 ఇన్నింగ్స్‌ల్లో
తిలక్ వర్మ – 166 ఇన్నింగ్స్‌ల్లో
ఒకే ఒక్కడు..
టీ20 క్రికెట్లో 40కి పైగా సగటు 140 కంటే ఎక్కువ స్ట్రైక్ రేటుతో 5000 పరుగుల మైలురాయిని చేరుకున్న ఏకైక క్రికెటర్‌గా తిలక్ వర్మ నిలిచాడు. ఇప్పటి వరకు 143 మంది ఆటగాళ్లు టీ20ల్లో 5 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నారు. వీరిలో 44 మంది 140 లేదా అంతకంటే ఎక్కువ స్ట్రైక్‌రేటును కొనసాగిస్తూ ఈ మైలురాయిని సాధించారు. ఆ 143 మందిలో ఐదుగురు ఆటగాళ్లు 40 లేదా అంతకంటే ఎక్కువ సగటును కలిగి ఉన్నారు.
View this post on Instagram
