Gautam Gambhir : రెండో టీ20 మ్యాచ్‌లో ఓటమి.. గంభీర్ కీలక వ్యాఖ్యలు.. ఆ ఆటగాళ్ల కెరీర్ ప్రమాదంలో పడింది..
వెస్టిండీస్‌తో రెండో టీ20 మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) కీలక వ్యాఖ్యలు చేశాడు.
Careers Are At Stake Team India head coach Gautam Gambhir comments after West indies beat india in 2nd t20
Gautam Gambhir : ఓ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో 500 పరుగులకు పైగా (రెండు జట్లు కలిపి) నమోదు కావడం చరిత్రలో ఇది రెండో సారి మాత్రమే. శుక్రవారం రాంచీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్, వెస్టిండీస్ జట్లు కలిపి 501 పరుగులు సాధించాయి. ఈ క్రమంలో క్రికెట్ కళ తప్పుతోందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు పిచ్లే కారణం అని అంటున్నారు. తాజాగా దీనిపై టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. ఇలాంటి పరిస్థితుల్లో బౌలర్ల కెరీర్ ప్రమాదంలో పడుతుందన్నాడు.
రాంచీ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ఇక ఛేదనకు దిగిన వెస్టిండీస్ మరో 9 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఇరు జట్లు కలిపి 501 పరుగులు చేసినట్లైంది.
Saaniya tendulkar : సచిన్ కోడలు.. సానియా టెండూల్కర్ గోవా డైరీస్ ఫోటోలు.. వైరల్..
దీనిపై గంభీర్ మ్యాచ్ అనంతరం మాట్లాడాడు. బంతి, బ్యాట్‌కు మధ్య మంచి పోటీ ఉండాలని అన్నాడు. క్రికెట్ ప్రేమికులు అంతా అదే కోరుకుంటారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పరిస్థితుల్లో బౌలర్ల కెరీర్లు ప్రమాదంలో పడుతున్నాయని తెలిపాడు. వారు ఎంతో శ్రమిస్తున్నారని, అయితే.. అదంతా వృథాగా మారిపోతుందన్నాడు. ఎప్పుడైతే బంతి, బ్యాట్‌కు మధ్య మంచి పోటీ ఉంటుందో అప్పుడే అత్త్యుతమ క్రికెట్‌ను చూడగలమని తెలిపాడు.
రోస్టన్ ఛేజ్ పై ప్రశంసలు..
ఒకే లైన్ అండ్ లెంగ్త్‌లో బంతులు వేస్తే బ్యాటర్లు సెటిల్ అయిపోతారని అన్నాడు. పరిస్థితులను బట్టి వేరియేషన్లను మార్చుకోవాలన్నాడు. రెండో టీ20 మ్యాచ్‌లో రోస్టన్ ఇదే పని చేశాడని చెప్పుకొచ్చాడు. అతడు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శివమ్ దూబెలను ఔట్ చేయడంతో భారత్ స్కోరు నెమ్మదించిందని గంభీర్ చెప్పాడు. ఈ మ్యాచ్‌లో ఛేజ్ 24 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.
Tilak Varma : చరిత్ర సృష్టించిన తెలుగు తేజం తిలక్ వర్మ.. టీ20 క్రికెట్లో ఏకైక ఆటగాడు..
రెండో టీ20 మ్యాచ్‌లో ఓటమిపై గౌతమ్ గంభీర్ స్పందించాడు. మ్యాచ్‌లో ఓటమికి ఎవరిని నిందించనని అన్నాడు. నిజం చెప్పాలంటే 250 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినప్పుడు ఈజీగానే గెలుస్తామని అనుకున్నామన్నాడు. టాస్ అనేది మన చేతుల్లో ఉండదని చెప్పాడు. ఇక మ్యాచ్‌ల్లో క్యాచ్‌లు మిస్ చేయడం సహజంగా జరుగుతూనే ఉంటాయన్నాడు. అయితే.. విండీస్ లాంటి ఓ ప్రమాదకర జట్టుతో ఆడుతున్నప్పుడు స్కోరును కాపాడుకోకునేందుకు కొత్త మార్గాలను అన్వేషించాలని ఈ మ్యాచ్ ద్వారా అర్థమూనట్లు తెలిపాడు.
