IND vs WI : ఉప్పల్‌లో వెస్టిండీస్‌తో నాలుగో టీ20 మ్యాచ్ నేడే.. అటు తిలక్ వర్మ ఇటు సంజూ శాంసన్‌లను ఊరిస్తున్న భారీ రికార్డు.. అందుకునేది ఎవరో?
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు (అక్టోబర్ 14 బుధవారం) భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య (IND vs WI) హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది.
- Thota Vamshi Kumar
- Updated on- October 14, 2026 / 11:14 AM IST
IND vs WI 4th T20 match in Uppal today Tilak Varma and Sanju Samson eye on major record
IND vs WI : ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు (అక్టోబర్ 14 బుధవారం) భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు సంజూ శాంసన్, తిలక్ వర్మలను ఓ అరుదైన మైలురాయి ఊరిస్తోంది.
సంజూ 2 సిక్సర్లు బాదితే..
ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ రెండు సిక్సర్లు కొడితే అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 100 సిక్సర్ల మైలురాయి చేరుకుంటాడు. ఈ ఘనత సాధించిన ఆరో భారత బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కుతాడు. ఇప్పటి వరకు రోహిత్ శర్మ, అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలు మాత్రమే భారత్ తరుపున టీ20ల్లో 100 సిక్సర్లు బాదారు.
ఇక అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 2015లో సంజూ శాంసన్ అరంగ్రేటం చేయగా.. ఇప్పటి వరకు 75 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 28.8 సగటుతో 1663 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 9 అర్థశతకాలు ఉన్నాయి. 142 ఫోర్లు, 98 సిక్సర్లు బాదాడు.
తిలక్ వర్మ 10 సిక్సర్లు బాదితే..
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో మరో 10 సిక్సర్లు కొడితే తిలక్ వర్మ సైతం 100 సిక్సర్ల మైలురాయిని చేరుకుంటాడు. ఉప్పల్ స్టేడియం తిలక్ వర్మకు హోం గ్రౌండ్ అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాస్త కష్టమే అయినప్పటికి కూడా ఉప్పల్‌లో తిలక్ ఈ రికార్డును అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
2023లో అంతర్జాతీయ టీ20 క్రికెట్లో తిలక్ వర్మ అరంగ్రేటం చేశాడు. ఇప్పటి వరకు 68 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 44.8 సగటుతో 1791 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 138 ఫోర్లు, 90 సిక్సర్లు బాదాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్లు..
* రోహిత్ శర్మ – 159 మ్యాచ్‌ల్లో 205 సిక్సర్లు
* సూర్యకుమార్ యాదవ్ – 113 మ్యాచ్‌ల్లో 179 సిక్సర్లు
* అభిషేక్ శర్మ – 65 మ్యాచ్‌ల్లో 141 సిక్సర్లు
* హార్దిక్ పాండ్యా – 138 మ్యాచ్‌ల్లో 126 సిక్సర్లు
* విరాట్ కోహ్లీ – 125 మ్యాచ్‌ల్లో 124 సిక్సర్లు
* కేఎల్ రాహుల్ – 72 మ్యాచ్‌ల్లో 99 సిక్సర్లు
* సంజూ శాంసన్ – 75 మ్యాచ్‌ల్లో 98 సిక్సర్లు
* తిలక్ వర్మ – 68 మ్యాచ్‌ల్లో 90 సిక్సర్లు
