IND-w vs SL-w 1st t20 smriti mandhana need 18 runs to get 4000 international T20 runs
Smriti Mandhana : వన్డే ప్రపంచకప్ 2025 సాధించిన అనంతరం భారత మహిళా క్రికెట్ జట్టు తొలి సారి ఓ టోర్నీ ఆడబోతుంది. శ్రీలంక మహిళల జట్టుతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. నేడు (ఆదివారం, నవంబర్ 21) భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుంది.
కాగా.. ఈ సిరీస్‌కు ముందు టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ సిరీస్‌లో మంధాన మరో 18 పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 4 వేల పరుగులు మైలురాయిని చేరుకున్న తొలి భారత మహిళా ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తుంది.
Team India : ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఏడుగురు.. టీ20 ప్రపంచకప్ 2026 భారత జట్టులో..
ఇక ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్ గా రికార్డులకు ఎక్కుతుంది. న్యూజిలాండ్ ప్లేయర్ సుజీ బేట్స్ మాత్రమే ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 4 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి ప్లేయర్‌గా ఉంది.
2013లో స్మృతి మంధాన అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరంగ్రేటం చేసింది. ఇప్పటి వరకు 153 మ్యాచ్‌లు ఆడింది. 147 ఇన్నింగ్స్‌ల్లో 29.9 సగటు 124 స్ట్రైక్ రేటుతో 3982 పరుగులు చేసింది. ఇందులో ఓ సెంచరీ, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు..
సుజీ బేట్స్ (న్యూజిలాండ్) – 177 మ్యాచ్‌ల్లో 4716 పరుగులు
స్మృతి మంధాన (భారత్) – 153 మ్యాచ్‌లు 3982 పరుగులు
హర్మన్‌ప్రీత్ కౌర్ (భారత్) – 182 మ్యాచ్‌లు 3654 పరుగులు
చమరి అతపత్తు (శ్రీలంక) – 146 మ్యాచ్‌లు 3458 పరుగులు
సోఫీ డివైన్ (న్యూజిలాండ్) – 146 మ్యాచ్‌లు 3431 పరుగులు