Courtesy : EspnCricinfo
IND Women vs PAK Women: ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో భాగంగా భారత్, పాకిస్థాన్ తలపడ్డాయి. పాక్ ను భారత్ చిత్తు చిత్తుగా ఓడించింది. 88 పరుగుల తేడాతో పాక్ ను మట్టి కరిపించింది భారత్. 248 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పాక్.. 159 పరుగులకే ఆలౌట్ అయ్యింది. సిద్రా ఆమిన్ (81) పోరాటం చేసినా మరో ఎండ్ లో సహకారం లేకపోవడంతో ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, దీప్తి శర్మ చెలరేగారు. తలో మూడు వికెట్లు తీశారు. స్నేహ్ రానా రెండు వికెట్లు పడగొట్టారు. ఈ టోర్నీలో భారత్ కు ఇది రెండో విజయం.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 247 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్లు ప్రతికా రవల్ (31), మంధాన (23) రాణించారు. హర్లిన్ డియోల్ (46) చక్కటి ఇన్నింగ్ ఆడారు. అయితే మరో ఎండ్ లో ఆమెకు సహకారం లేకపోయింది. చివరలో రిచా (35) మెరిశారు. దాంతో భారత్ 247 పరుగులు చేసింది.
క్రికెట్ లో చిరకాల ప్రత్యర్థి పాక్ కు భారత్ చేతిలో మరోసారి భంగపాటు తప్పలేదు. అది మెన్స్ అయినా ఉమెన్స్ అయినా.. పాక్ ను మనోళ్లు మట్టికరిపిస్తున్నారు. టోర్నీ ఏదైనా గెలుపు మాత్రం భారత్ దే. ఇటీవల ఆసియా కప్ లో పాక్ ను భారత్ చిత్తు చిత్తుగా ఓడించింది. ఫైనల్లో పాక్ ను ఓడించి ఆసియా కప్ విజేతగా నిలిచింది భారత్.
Also Read: పురుషుల జట్టు బాటలోనే.. పాక్ కెప్టెన్‌తో కరచాలనం నిరాకరించిన హర్మన్‌ప్రీత్ కౌర్..