Indian women Team
Indian vs Australia : సొంతగడ్డపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయాలను అందుకుంటోంది. వారం రోజుల వ్యవధిలో టెస్టుల్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లను ఓడించింది. ఈ విజయాలు ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు ఆస్ట్రేలియాతో టీ20, వన్డే సిరీస్‌లకు టీమ్ఇండియా సిద్ధమవుతోంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆస్ట్రేలియాతో తలపడే భారత టీ20, వన్డే జట్లను సోమవారం ప్రకటించింది. హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోనే టీమ్ఇండియా బరిలోకి దిగనుంది.
ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన శ్రేయాంక పాటిల్ కు మొదటి సారి వన్డే జట్టులో స్థానం దక్కింది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్), ఏ జట్టు తరుపున రాణించిన మన్నత్ కశ్యప, సైకా ఇషాక్, టిటస్ సాధుకు వన్డే, టీ20 సిరీస్‌లలో చోటు లభించింది. మూడు వన్డేల సిరీస్ డిసెంబర్ 28 నుంచి ఆరంభం కానుండగా, మూడు మ్యాచుల టీ20 సిరీస్ జనవరి 5 నుంచి ఆరంభం కానుంది.
వన్డేలకు భారత మహిళల జట్టు : హర్మన్ ప్రీత్ కౌర్ ( కెప్టెన్ ), స్మృతి మంధాన ( వైస్ కెప్టెన్ ), జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, యాస్తికా భాటియా ( వికెట్ కీపర్ ), రిచా ఘోష్ ( వికెట్ కీపర్ ), అమన్‌జోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, మన్నత్ కశ్యప్, సైకా ఇషాక్, రేణుకా సింగ్ ఠాకూర్, సాధు, పూజా వస్త్రాకర్, స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్
టీ20లకు భారత మహిళల జట్టు : హర్మన్ ప్రీత్ కౌర్ ( కెప్టెన్ ), స్మృతి మంధాన ( వైస్ కెప్టెన్ ), జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, యాస్తికా భాటియా ( వికెట్ కీపర్ ), రిచా ఘోష్ ( వికెట్ కీపర్ ), అమన్‌జోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, మన్నత్ కశ్యప్, సైకా ఇషాక్, రేణుకా సింగ్ ఠాకూర్, సాధు, పూజా వస్త్రాకర్, కనికా అహుజా, మిన్ను మణి.
? NEWS ?#TeamIndia’s ODI & T20I squad against Australia announced.
Details ? #INDvAUS | @IDFCFIRSTBankhttps://t.co/7ZsqUFR9cf
— BCCI Women (@BCCIWomen) December 25, 2023