Teamindia : యువ‌రాజ్ మెరుపులు, ప‌ఠాన్ బ్ర‌ద‌ర్స్ ఊచ‌కోత‌.. పైన‌ల్‌లోకి భార‌త్‌.. సెమీస్‌లో ఆసీస్ చిత్తు..

ఇండియా ఛాంపియ‌న్స్ అద‌ర‌గొడుతోంది. వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024లో ఫైన‌ల్‌కు చేరుకుంది.

India beat Australia by 86 runs to reach WCL 2024 final

ఇండియా ఛాంపియ‌న్స్ అద‌ర‌గొడుతోంది. వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024లో ఫైన‌ల్‌కు చేరుకుంది. శుక్ర‌వారం నార్తాంప్ట‌న్ వేదిక‌గా జ‌రిగిన సైమీఫైన‌ల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఛాంపియ‌న్స్‌ను 86 ప‌రుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది.

రాబిన్ ఉత‌ప్ప (65; 35 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స‌ర్లు), యువ‌రాజ్ సింగ్ (59; 28 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) లు దంచికొట్టగా.. యూసఫ్ పఠాన్‌(51; 23 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), ఇర్ఫాన్ పఠాన్‌(50; 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) లు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడ‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 254 ప‌రుగులు చేసింది. ఆసీస్ బౌల‌ర్ల‌లో సిడిల్ 4 వికెట్లు తీశాడు. కౌల్టర్‌నైల్‌, దోహర్టీ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

ధోనీకి కోపం వస్తే ఏం చేస్తాడో తెలుసా..! ఆత్మకథలో ఆసక్తికర విషయాన్ని చెప్పిన అశ్విన్

అనంతరం 255 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు న‌ష్ట‌పోయి 168 పరుగులకే పరిమితమైంది. ఆసీస్ బ్యాటర్లలో టిమ్ పైన్‌(40; 32 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) టాప్ స్కోరర్‌. భారత బౌలర్లలో ధావ‌ల్ కులకర్ణి, పవన్ నేగి లు చెరో రెండు వికెట్లు తీశారు. హార్భజన్ సింగ్‌, ఇర్ఫాన్ ప‌ఠాన్‌, శుక్లాలు తలా ఓ వికెట్ సాధించారు.

ఆసీస్ పై గెల‌వ‌డంతో భార‌త్ ఫైన‌ల్‌కు దూసుకువెళ్లింది. ఫైన‌ల్ మ్యాచ్‌లో చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్తాన్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

James Anderson : అంత‌ర్జాతీయ క్రికెట‌ర్‌కు జేమ్స్ ఆండర్సన్ వీడ్కోలు.. సచిన్ ఎమోషనల్ వీడియో చూశారా..

ట్రెండింగ్ వార్తలు