James Anderson : అంత‌ర్జాతీయ క్రికెట‌ర్‌కు జేమ్స్ ఆండర్సన్ వీడ్కోలు.. సచిన్ ఎమోషనల్ వీడియో చూశారా..

జేమ్స్ ఆండర్సన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పడంతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేశారు.

James Anderson : అంత‌ర్జాతీయ క్రికెట‌ర్‌కు జేమ్స్ ఆండర్సన్ వీడ్కోలు.. సచిన్ ఎమోషనల్ వీడియో చూశారా..

James Anderson

James Anderson Retirement : దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఇంగ్లండ్ వేదికగా ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ జరుగుతుంది. తొలి టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో విజయంతో తన కెరీర్ కు ఆండర్సన్ ముగింపు పలికాడు. 21 సంవత్సరాల టెస్ట్ కెరీర్లో 188 మ్యాచ్ లు ఆడిన ఆండర్సన్ 704 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్ క్రికెట్ లో అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. టెస్టుల్లో మురళీధరన్ (800 వికెట్లు), షేన్ వార్న్ (708 వికెట్లు) తరువాత అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్ గా ఆండర్సన్ ఘనత సాధించాడు. అంతేకాదు.. సచిన్ టెండూల్కర్ (200) తరువాత అత్యధిక టెస్టులు ఆడిన రెండో ఆటగాడిగా ఆండర్సన్ (188) నిలిచాడు.

Also Read : ధోనీకి కోపం వస్తే ఏం చేస్తాడో తెలుసా..! ఆత్మకథలో ఆసక్తికర విషయాన్ని చెప్పిన అశ్విన్

జేమ్స్ ఆండర్సన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పడంతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేశారు. జిమ్మీ.. 22ఏళ్ల స్పెల్ తో అభిమానుల్ని బౌల్డ్ చేశావు. యాక్షన్, వేగం, కచ్చితత్వం, స్వింగ్, ఫిటెనెస్ తో కూడిన నీ బౌలింగ్ చూడటం ఆనందంగా ఉంటుంది. ఆటతో కొన్ని తరాలకు స్ఫూర్తిగా నిలిచావు. జీవితంలో అత్యంత ముఖ్యమైన స్పెల్ లో కుటుంబంతో కలిసి ఆరోగ్యం, ఆనందంతో అద్భుతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాని సచిన్ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

Also Read : బీచ్‌లో ఈతకొడుతూ 80కి.మీ సముద్రంలోకి కొట్టుకుపోయిన యువతి.. 37గంటల తరువాత ఏం జరిగిందంటే?