IND vs AFG 2nd T20 : దంచికొట్టిన శివ‌మ్ దూబె, య‌శ‌స్వి జైస్వాల్‌.. రెండో టీ20 భార‌త్ విజ‌యం.. సిరీస్ కైవ‌సం

మ‌రో మ్యాచ్ మిగిలిన ఉండ‌గానే టీ20 సిరీస్ టీమ్ఇండియా సొంత‌మైంది.

IND vs AFG 2nd T20 : మ‌రో మ్యాచ్ మిగిలిన ఉండ‌గానే టీ20 సిరీస్ టీమ్ఇండియా సొంత‌మైంది. ఇండోర్ వేదిక‌గా అఫ్గానిస్తాన్‌తో జ‌రిగిన రెండో టీ20 మ్యాచులో భార‌త్ ఆరు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. 173 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 15.4 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భార‌త బ్యాట‌ర్ల‌లో య‌శ‌స్వి జైస్వాల్ (68; 34 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), శివ‌మ్ దూబె (63నాటౌట్‌; 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) లు మెరుపు హాఫ్ సెంచ‌రీలు బాదారు. రోహిత్ శ‌ర్మ, జితేశ్ శ‌ర్మ‌లు డ‌కౌట్ అయిన‌ప్ప‌టికీ విరాట్ కోహ్లీ (29; 16 బంతుల్లో 5 ఫోర్లు), రింకూ సింగ్ (9 నాటౌట్) లు రాణించారు. అఫ్గాన్ బౌల‌ర్ల‌లో కరీం జనత్ రెండు వికెట్లు తీశాడు. మ‌హ్మ‌ద్ న‌బీ, ఫజల్హక్ ఫారూఖీలు చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

అంతక ముందు గుల్బాదిన్ నైబ్ (57; 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కం బాద‌డంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 172 ప‌రుగులు చేసింది. నజీబుల్లా జద్రాన్‌ (23; 21 బంతుల్లో 1 ఫోర్‌), ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ (21; 9 బంతుల్లో 2 పోర్లు, 2 సిక్సర్లు), కరీమ్‌ జనత్‌ ( 20; 10 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌) రాణించారు. టీమ్ఇండియా బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు సాధించాడు. అక్ష‌ర్ ప‌టేల్‌, ర‌వి బిష్ణోయ్‌లు చెరో రెండు వికెట్లు తీయ‌గా శివ‌మ్ దూబె ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

Mohammad Rizwan : టీ20ల్లో రిజ్వాన్ అరుదైన రికార్డు.. సిక్స‌ర్ల మోత‌..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్‌కు శుభారంభం ద‌క్క‌లేదు. 14 ప‌రుగులు చేసిన రెహ్మ‌నుల్లా గుర్భాబ్ జ‌ట్టు స్కోరు 20 ప‌రుగుల వ‌ద్ద ర‌వి బిష్ణోయ్ బౌలింగ్‌లో తొలి వికెట్‌గా ఔట్ అయ్యాడు. ఆ త‌రువాత అక్ష‌ర్ ప‌టేల్‌, శివ‌మ్ దూబెలు వ‌రుస ఓవ‌ర్ల‌లో ఇబ్ర‌హీం జ‌ద్రాన్ (8), అజ్మ‌తుల్లా(2)ల‌ను పెవిలియ‌న్‌కు చేర్చాడు. దీంతో అఫ్గాన్ 60 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది.

దంచికొట్టిన గుల్బాదిన్‌

ఈ మ్యాచ్‌లో వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన గుల్బాదిన్ నైబ్ ఆరంభం నుంచే భార‌త బౌల‌ర్ల పైకి ఎదురుదాడికి దిగాడు. ర‌విబిష్ణోయ్ బౌలింగ్‌లో 6,6,4 బాదిన నైబ్.. దూబే ఓవ‌ర్‌లో రెండు భారీ సిక్స‌ర్లు కొట్టాడు. 28 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. అయితే.. అక్ష‌ర్ ప‌టేల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు య‌త్నించి ఔట్ అయ్యాడు. ఆఖర్లో కరీమ్‌ జనత్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్ లు వేగంగా ఆడ‌డంతో అఫ్గాన్ స్కోరు 170 ప‌రుగులు దాటింది.

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ‌కు అవ‌మానం..! ముంబై ఇండియ‌న్స్ పై మండిప‌డుతున్న ఫ్యాన్స్‌..

ట్రెండింగ్ వార్తలు