Ind vs Eng 1st Test Day 2 : ఉప్ప‌ల్ టెస్టులో ప‌ట్టుబిగించిన భార‌త్‌.. 175 ప‌రుగుల ఆధిక్యం

ఉప్ప‌ల్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టు మ్యాచులో భార‌త జ‌ట్టు ప‌ట్టుబిగించింది.

Ind vs Eng 1st Test

Ind vs Eng 1st Test : ఉప్ప‌ల్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టు మ్యాచులో భార‌త జ‌ట్టు ప‌ట్టుబిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జ‌ట్టు 246 ప‌రుగుల‌కు ఆలౌట్ కాగా.. అనంత‌రం మొద‌టి ఇన్నింగ్స్ ఆరంభించిన భార‌త్ రెండో రోజు ఆట ముగిసే స‌మయానికి ఏడు వికెట్లు న‌ష్ట‌పోయి 421 ప‌రుగులు చేసింది. ర‌వీంద్ర జడేజా (81), అక్ష‌ర్ ప‌టేల్ (35) లు క్రీజులో ఉన్నారు. ప్ర‌స్తుతం భార‌త్ 175 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది.

ఓవ‌ర్ నైట్ స్కోరు వికెట్ న‌ష్టానికి 119 ప‌రుగుల‌తో రెండో రోజు ఆట‌ను ఆరంభించిన భార‌త్ రోజంతా బ్యాటింగ్ చేసింది. ఇంకో ఆరు వికెట్లు కోల్పోయి మ‌రో 302 ప‌రుగులు చేసింది.

రెండో రోజు ఆట ఆరంభ‌మైన కాసేప‌టికే దూకుడుగా ఆడుతున్న యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ (80) ఓవ‌ర్ నైట్ స్కోరుకు మ‌రో నాలుగు ప‌రుగులు మాత్ర‌మే జోడించి ఔట్ అయ్యాడు. మ‌రికాసేప‌టికే శుభ్‌మ‌న్ గిల్ (23) సైతం పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో భార‌త్ 159 ప‌రుగుల వ‌ద్ద మూడు వికెట్లు కోల్పోయింది. ఈ ద‌శ‌లో ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్య‌త‌ను కేఎల్ రాహుల్ (86; 123 బంతుల్లో 8 ఫోర్లు, 2సిక్స‌ర్లు), శ్రేయ‌స్ అయ్య‌ర్ (35) భుజాన వేసుకున్నారు.

Shoaib Malik : షోయ‌బ్ మాలిక్ పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు.. కాంట్రాక్ట్ ర‌ద్దు..!

క్రీజులో నిల‌దొక్కుకునేందుకు కాస్త స‌మ‌యం తీసుకున్న రాహుల్ ఆ త‌రువాత ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగాడు. మ‌రో వైపు శ్రేయ‌స్ అయ్య‌ర్ సైతం ధాటిగా ఆడే ప్ర‌య‌త్నంలో ఔట్ అయ్యాడు. శ్రేయ‌స్‌-రాహుల్ జోడి నాలుగో వికెట్‌కు 64 ప‌రుగులు జోడించారు. అనంత‌రం జ‌డేజా జ‌త‌గా రాహుల్ దూకుడుగా ఆడాడు. ఈ క్ర‌మంలో త‌న 50వ టెస్టు మ్యాచులో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. ఆ త‌రువాత మ‌రింత వేగం పెంచిన రాహుల్ శ‌త‌కానికి 14 ప‌రుగుల దూరంలో ఔట్ అయ్యాడు. అప్ప‌టికే భార‌త్ ఆధిక్యంలోకి వెళ్లింది.

తెలుగు కుర్రాడు, వికెట్ కీప‌ర్ అయిన కేఎస్ భ‌ర‌త్ (41) అండ‌తో జ‌డేజా స్వేచ్ఛ‌గా బ్యాటింగ్ చేశాడు. భ‌ర‌త్, అశ్విన్ (1)లు స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో ఔటైనా అక్ష‌ర్ ప‌టేల్ తో కలిసి మ‌రో వికెట్ ప‌డ‌కుండా రోజును ముగించాడు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో టామ్ హార్ట్లీ, జోరూట్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. జాక్ లీచ్‌, రెహాన్ అహ్మద్ లు త‌లా ఓ వికెట్ సాధించారు.

AUS vs WI : చూసుకోవాలి గ‌దా మామా.. ఇప్పుడు ఏమైందో చూడు.. దెబ్బలు గ‌ట్టిగానే త‌గిన‌ట్లున్నాయ్‌గా..!

ట్రెండింగ్ వార్తలు