WTC Points table : ఓట‌మి బాధ‌లో ఉన్న టీమ్ఇండియాకు భారీ షాక్‌.. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ ఆశ‌లు గ‌ల్లంతు..!

ఓట‌మి బాధలో ఉన్న టీమ్ఇండియా మ‌రో షాక్ త‌గిలింది.

Team India

World Test Championship Points table : ఉప్ప‌ల్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన మొద‌టి టెస్టు మ్యాచులో టీమ్ఇండియా 28 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. ఈ నేప‌థ్యంలో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. కాగా.. ఓట‌మి బాధలో ఉన్న టీమ్ఇండియా మ‌రో షాక్ త‌గిలింది. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌(డ‌బ్ల్యూటీసీ) 2023-2025 పాయింట్ల ప‌ట్టిక‌లో ఐదో స్థానానికి ప‌డిపోయింది.

ఉప్ప‌ల్ మ్యాచ్‌కు ముందు రెండో స్థానంలో ఉంది టీమ్ఇండియా. డ‌బ్ల్యూటీసీ 2023-25 సైకిల్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్ ఐదు టెస్టు మ్యాచులు ఆడింది. ఇందులో రెండు మ్యాచుల్లో విజ‌యం సాధించ‌గా మ‌రో రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ డ్రా గా చేసుకుంది. భార‌త్ ఖాతాలో 26 పాయింట్లు ఉన్నాయి. విజ‌య‌శాతం 43.33గా ఉంది.

IND vs ENG : టీమ్ఇండియాకు షాక్‌.. ఉప్ప‌ల్ టెస్టులో ఇంగ్లాండ్ విజ‌యం.. హైద‌రాబాద్‌లో భార‌త్‌కు తొలి ఓట‌మి

ఇక గ‌బ్బా టెస్టు మ్యాచులో వెస్టిండీస్ చేతిలో చిత్తు అయిన‌ప్ప‌టికీ ఆస్ట్రేలియా త‌న మొద‌టి స్థానాన్ని కాపాడుకుంది. ఈ సైకిల్‌లో 10 టెస్టులు ఆడిన ఆసీస్ ఆరు మ్యాచుల్లో గెలిచింది. 3 మ్యాచుల్లో ఓడిపోగా ఒక మ్యాచ్ డ్రా చేసుకుంది. 55 విజ‌య‌శాతంతో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది. ఆ త‌రువాత ద‌క్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌లు వ‌రుస‌గా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఆయా జ‌ట్లు అన్నింటి విజ‌య‌శాతం 50గా ఉంది.

ఇక భార‌త జ‌ట్టు పై గెలిచిన‌ప్ప‌టికీ కూడా ఇంగ్లాండ్ ర్యాంకులో ఎటువంటి మార్పు రాలేదు. ఈ సైకిల్‌లో 6 మ్యాచులు ఆడిన ఇంగ్లాండ్ మూడు మ్యాచుల్లో గెల‌వ‌గా రెండింటిలో ఓడిపోయింది. ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. 29.16 విజ‌య‌శాతంతో ఎనిమిదో స్థానంలో కొన‌సాగుతోంది.

Hardik Pandya : హార్దిక్ పాండ్య ఎమోష‌న‌ల్.. ‘ప్ర‌తి రోజు నా శ‌క్తినంతా ధార‌పోస్తున్నా.. ఇది నా దేవాల‌యం’

వ‌రుస‌గా మూడో సారి ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ (డ‌బ్ల్యూటీసీ) ఫైన‌ల్‌కు టీమ్ఇండియా చేరుకోవాలంటే ఇంగ్లాండ్‌తో మిగిలిన నాలుగు టెస్టు మ్యాచుల్లో విజ‌యం సాధించడం త‌ప్ప‌ని స‌రి. ఇదిలా ఉంటే.. పాయింట్ల ప‌ట్టిక‌లో మొద‌టి రెండు స్థానాల్లో ఉన్న జ‌ట్లు డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ చేరుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు