Jasprit Bumrah : వస్తున్నా.. వచ్చేస్తున్నా.. అంటున్న బుమ్రా.. వీడియో వైరల్
టీమ్ఇండియా పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రాను మైదానంలో చూసి చాలా కాలమే అయ్యింది. టీమ్ఇండియాలో అతడు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అతడు మళ్లీ ఎప్పుడు మైదానంలోకి అడుగుపెడతాడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Published On : July 18, 2023 / 04:50 PM IST
Jasprit Bumrah
Jasprit Bumrah posts video : టీమ్ఇండియా పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రాను మైదానంలో చూసి చాలా కాలమే అయ్యింది. వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రా గతేడాది న్యూజిలాండ్‌లో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు. ఫిట్‌నెస్ సాధించే పనిలో ఉన్నాడు. టీమ్ఇండియాలో అతడు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. టీ20 ప్రపంచకప్ 2022, డబ్ల్యూటీసీ 2023 ఫైనల్ మ్యాచ్‌లలో బుమ్రా ఉంటే ఫలితం మరోలా ఉండేదని పలువురు మాజీ ఆటగాళ్లు, క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.
Asia Cup 2023 : వారంలో ఆసియా కప్ షెడ్యూల్.. ఆరంభ మ్యాచ్ ఎక్కడంటే..?
అతడు మళ్లీ ఎప్పుడు మైదానంలోకి అడుగుపెడతాడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆసియా కప్‌లో పాటు స్వదేశంలో జరగనున్న ప్రపంచ కప్‌లో బుమ్రా ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మంగళవారం తన సోషల్ మీడియాలో ‘ఐ యామ్ కమింగ్ హోమ్ ‘అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు బుమ్రా. ఈ వీడియోలో తన ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫోటోలు ఉన్నాయి. ప్రస్తుతం బుమ్రా రోజుకు ఎనిమిది నుంచి పది ఓవర్లు బౌలింగ్ చేస్తున్నట్లు ఎన్‌సీఏ వర్గాలు చెబుతున్నాయి. బుమ్రా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నీకోసమే వెయిటింగ్ ఇక్కడ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
Carlos Alcaraz : వింబుల్డన్ 2023 ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్ గర్ల్‌ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆగస్టులో జరిగే ఐర్లాండ్ టూర్‌లో బుమ్రా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆగస్టు 18 నుంచి ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. హార్ధిక్ పాండ్య నేతృత్వంలోని భారత జట్టు ఐర్లాండ్ తో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్ కోసం బుమ్రాను అక్కడికి పంపాలని బీసీసీఐ పెద్దలు బావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారత జట్టు వెస్టిండీస్ పర్యటనలో ఉంది. మొదటి టెస్టులో ఘన విజయం సాధించిన రోహిత్ బృందం జూలై 20 నుంచి ఆరంభం కానున్న రెండో టెస్టు మ్యాచ్ కోసం సన్నద్దం అవుతోంది.
