Team India
Team India Quarantine : ఇంగ్లాండ్ సిరీస్ ముందు క్వారంటైన్ లో పది రోజులు తప్పకుండా ఉండాల్సిందేనా ? రోజులను కుదించే అవకాశం లేదా అనే సందిగ్ధత తొలగిపోయింది. పది రోజులను మూడు రోజులకు కుదించేందుకు ఇంగ్లాండ్ క్రికేట్ బోర్డు ఒప్పకుంది. బీసీసీఐకి అంగీకారం తెలిపింది. ఇంగ్లాండ్ టూర్ కోసం పురుషులు,, మహిళల టీమ్స్ జూన్ 02వ తేదీన ఒకే విమానంలో బయలుదేరాల్సి ఉంది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌లో భాగంగా జూన్ 18న న్యూజిలాండ్‌తో కోహ్లీ సేన తలపడనుంది. కోహ్లీ సేన నేరుగా సౌతాంప్టన్ లో దిగి అక్కడున్న హోటల్స్ లో క్వారంటైన్ కానున్నారు. ఇక మిథాలీ సేన బ్రిస్టల్ కు వెళ్లి క్వారంటైన్ కానుంది. అయితే..ఇక్కడకు వచ్చాక..పది రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సిందేనని ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ముందు కండిషన్ పెట్టింది. ఈ మేరకు భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఈసీబీతో సంప్రదింపులు జరిపింది.
చివరకు బీసీసీఐ చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన ఇంగ్లాండ్ బోర్డు మూడు రోజులకు కుదించింది. దీంతో నాలుగో రోజు నుంచి జట్లు ప్రాక్టిస్ చేసుకొనే అవకాశం దక్కింది. ఇక్కడ..క్రికెటర్ల కుటుంబసభ్యులకు మాత్రం క్వారంటైన్ లో ఎన్ని రోజులు ఉండాలనే దానిపై ఓ నిర్ణయం తీసుకోలేదు.
జూన్ 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కోహ్లీ సేన – విలియమ్స్ టీం తలపడనున్నాయి. ఆగస్టు 04వ తేదీ నుంచి సెప్టెంబర్ 14 వరకు ఇంగ్లాడ్ తో ఐదు టెస్టు సిరీస్ లను ఆడనుంది. ఇక మిథాలీ సేన జూన్ 16వ తేదీన ఇంగ్లాండ్ తో ఏకైక టెస్టు ఆడనుంది. అనంతరం మూడు వన్డేలు, మూ టీ20లు ఆడుతుంది.
Read More : Flight Emergency Landing: ప్రేయసితో అసభ్య ప్రవర్తన.. విమానం అత్యవసర ల్యాండింగ్