Flight Emergency Landing: ప్రేయసితో అసభ్య ప్రవర్తన.. విమానం అత్యవసర ల్యాండింగ్

విమానంలో అల్లరి చేయడం కామనే, కానీ అల్లరి చేసిన వ్యక్తిని విమానంలోంచి దింపేదుకు విమానం ల్యాండ్ చెయ్యడం మాత్రం అరుదైన విషయమే. అమెరికాలోని మిన్నియా విమానాశ్రయంలో జెట్ బ్లూ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది.

Flight Emergency Landing: ప్రేయసితో అసభ్య ప్రవర్తన.. విమానం అత్యవసర ల్యాండింగ్

Flight Emergency Landing

Updated On : May 22, 2021 / 1:00 PM IST

Flight Emergency Landing: విమానంలో అల్లరి చేయడం కామనే, కానీ అల్లరి చేసిన వ్యక్తిని విమానంలోంచి దింపేదుకు విమానం ల్యాండ్ చెయ్యడం మాత్రం అరుదైన విషయమే. అమెరికాలోని మిన్నియా విమానాశ్రయంలో జెట్ బ్లూ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. దీనికి కారణం విమానంలోని ఓ వ్యక్తి మాస్క్ పెట్టుకోకుండా నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు తన ప్రేయసితో అసభ్యంగా ప్రవర్తించడం. మద్యం మత్తులో విమానం ఎక్కిన వ్యక్తి మాస్క్ పెట్టుకోలేదు.. విమానం సిబ్బంది మాస్క్ పెట్టుకోవాలని సూచించారు. కానీ అతడు వినలేదు.

మాస్క్ లేకుండా విమానంలో పక్కసీట్లో ఉన్న తన ప్రేయసిని కౌగిలించుకోవడం, అసభ్యంగా తాకడం చేశాడు. అయితే కొద్దీ సేపటి తర్వాత అతడి ముక్కు నుంచి ఓ తెల్లటి పదార్థం బయటకు వచ్చింది. దీంతో భయపడిన విమాన సిబ్బంది వెంటనే ఫైలెట్లకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు మిన్నియా విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. సదరు వ్యక్తితోపాటు అతడి ప్రియురాలిని కూడా కిందకు దింపారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు.

పోలీసుల విచారణలో ఆ వ్యక్తి పేరు మార్క్ ఆంథోనీ స్కెర్బో(40)గా తెలిసింది. న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే ఎయిర్‌పోర్టు నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్తున్న జెట్‌బ్లూ విమానం 915లో ఈ ఘటన చోటు చేసుకుంది.