×
Ad

Vaibhav Suryavanshi : యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ప్రమోషన్.. ఏకంగా టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు

Vaibhav Suryavanshi : టీమిండియా యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ లక్కీఛాన్స్ కొట్టేశాడు. అద్భుత బ్యాటింగ్‌తో మైదానంలో పరుగుల వదర పారిస్తూ

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi : యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ లక్కీఛాన్స్ కొట్టేశాడు. అద్భుత బ్యాటింగ్‌తో అందరి ప్రశంసలు పొందుతున్న వైభవ్‌ను టీమిండియా కెప్టెన్‌గా బీసీసీఐ ప్రకటించింది.

Also Read : PV Sindhu : చీర‌క‌ట్టులో పీవీ సింధు.. అచ్చమైన తెలుగింటి అమ్మాయి..

జింబాబ్వే, నమీబియా ఆతిథ్యం ఇచ్చే అండర్ -19 వన్డే ప్రపంచ‌కప్ కోసం భారత జట్టును సెలెక్టర్లు శనివారం ప్రకటించారు. ఈ జట్టులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా ఉన్నాడు. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఆయుష్ మాత్రే, వైస్ కెప్టెన్‌గా విహాన్ మల్హోత్రా ఎంపికయ్యారు. జనవరి 15వ తేదీ నుంచి ఆరంభమయ్యే ఈ మెగా టోర్నీలో పాల్గొనే 15మంది సభ్యుల భారత జట్టును సెలెక్టర్లు వెల్లడించారు. జనవరి 15న అమెరికాతో మ్యాచ్‌తో భారత జట్టు టోర్నీని మొదలు పెట్టనుంది. 17న బంగ్లాదేశ్, 24న న్యూజిలాండ్ జట్టలతో తలపడుతుంది.

ఇదిలాఉంటే.. అండర్ -19 వన్డే ప్రపంచ‌కప్ మెగా టోర్నీకి ముందు భారత జట్టు దక్షిణాఫ్రికా జట్టుతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కు కూడా బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. అయితే, ఈ జట్టుకు యువ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు. రెగ్యులర్ కెప్టెన్ మాత్రమే, వైస్ కెప్టెన్ మల్హోత్రా గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. దీంతో మాత్రే స్థానంలో యువ ఆటగాడు సూర్యవంశీ జట్టును నడిపించనున్నాడు.

దక్షిణాఫ్రికాలో జరిగే వన్డే సిరీస్ కోసం భారత అండర్-19 జట్టుకు వైభవ్ సూర్యవంశీ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ పర్యటన ప్రపంచ‌కప్‌కు ముందు జరుగుతుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జనవరి 3వ తేదీన ప్రారంభమవుతుంది. జనవరి 5, 7 తేదీల్లో రెండు, మూడో వన్డే మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ మూడు మ్యాచ్‌లు దక్షిణాఫ్రికాలోని బెనోనిలోని విల్లోమూర్ పార్క్‌లో జరగనున్నాయి.

దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టు : వైభవ్ సూర్యవంశీ (కెప్టెన్), ఆరోన్ జార్జ్ (వైస్ కెప్టెన్), వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), హర్వాన్ష్ సింగ్ (వికెట్ కీపర్), ఆర్‌ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ ఎ. పటేల్, మహ్మద్ సింగ్ పటేల్, హేషన్ కుమార్ ఇనాన్, డి. మోహన్, యువరాజ్ గోహిల్, రాహుల్ కుమార్.

ICC పురుషుల అండర్-19 ప్రపంచ కప్ 2026 కోసం భారత అండర్-19 జట్టు: ఆయుష్ మ్హత్రే (కెప్టెన్), విహాన్ మల్హోత్రా (వైస్-కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), హర్వంశ్, కణ్‌కీపర్‌సింగ్, చోరీష్‌కీపర్‌సింగ్, పటేల్, మొహమ్మద్ ఎనాన్, హెనిల్ పటేల్, డి. దీపేష్, కిషన్ కుమార్ సింగ్, ఉదవ్ మోహన్.