India U19 vs Bangladesh U19 Vaibhav Suryavanshi Scripts History in U 19 World Cup 2026
U19 World Cup 2026 : టీమ్ఇండియా నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత సాధించాడు. అండర్-19 ప్రపంచకప్‌లో 50 ఫ్లస్ స్కోరు చేసిన అతి పిన్న వయస్కుడైన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా శనివారం భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సూర్య వంశీ కేవలం 30 బంతుల్లోనే అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇక మొత్తంగా 67 బంతులు ఎదుర్కొన్ని 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 72 పరుగులు సాధించాడు.
గతంలో ఈ రికార్డు అఫ్గానిస్తాన్‌కు చెందిన షాహిదుల్లా కమల్ పేరిట ఉంది. అతడు 15 ఏళ్ల 19 రోజుల వయసులో హాఫ్ సెంచరీ చేయగా సూర్య వంశీ 14 ఏళ్ల 296 రోజుల వయసులోనే ఈఘనత సాధించాడు. ఇక పాకిస్తాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజామ్ 2010లో వెస్టిండీస్ పై హాప్ సెంచరీ చేసి ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.
🚨 14 YEAR OLD VAIBHAV SURYAVANSHI SHOW 🚨
– Vaibhav Suryavanshi smashed 30 ball 50* against Bangladesh U19 in ICC U19 World Cup 2026 🔥
– This is the fastest fifty of U19 WC 2026. He smashed 6 fours and 3 sixes till now 👏🏻
– What’s your take 🤔 pic.twitter.com/iA3cSD6mqn
— Richard Kettleborough (@RichKettle07) January 17, 2026
పురుషుల అండర్ -19 ప్రపంచకప్‌లో 50 ఫ్లస్ స్కోర్ చేసిన అతి పిన్న వయస్కులైన బ్యాటర్లు వీరే..
* వైభవ్ సూర్యవంశీ (భారత్) – 14 ఏళ్ల 296 రోజులు – 2026లో బంగ్లాదేశ్ పై
* షాహిదుల్లా కమల్ (అఫ్గానిస్తాన్) -15 ఏళ్ల 19 రోజులు – 2014లో వెస్టిండీస్ పై
* బాబర్ ఆజామ్ (పాకిస్తాన్) – 15 ఏళ్ల 92 రోజులు – 2010లో వెస్టిండీస్ పై
* పర్వేజ్ మాలిక్జాయ్ (అఫ్గానిస్తాన్) – 15 ఏళ్ల 125 రోజులు – 2016లో ఫిజీ పై
* శరద్ వెసావ్కర్ (నేపాల్) – 15 ఏళ్ల 132 రోజులు – 2004లో ఇంగ్లాండ్ పై