×
Ad

IND vs NZ : టీమిండియాకు బిగ్ షాక్.. మరో ప్లేయర్ ఔట్..? వేలు చిట్లి రక్తస్రావం కావడంతో..

IND vs NZ : టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత జట్టును గాయాల బెడద వేదిస్తోంది. ఇప్పటికే వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ గాయాల కారణంగా న్యూజిలాండ్ జట్టుతో జరిగే టీ20 సిరీస్ కు దూరమయ్యారు. తాజాగా.. వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ గాయపడ్డాడు.

Axar Patel suffered finger injury

  • న్యూజిలాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో గాయపడిన అక్షర్ పటేల్
  • డారిల్ మిచెల్ కొట్టిన బంతిని అడ్డుకొనే క్రమంలో వేలికి గాయం
  • రక్తస్రావం కావడంతో మైదానాన్ని వీడిన అక్షర్
  • రెండో టీ20 మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం

IND vs NZ : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా బుధవారం రాత్రి తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది.

Also Read : India vs New Zealand: తొలి టీ20 మ్యాచ్‌.. ఆ నలుగురు భారత జట్టులో లేకుండానే బరిలోకి..

టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత జట్టును గాయాల బెడద వేదిస్తోంది. ఇప్పటికే వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ గాయాల కారణంగా న్యూజిలాండ్ జట్టుతో జరిగే టీ20 సిరీస్ కు దూరమయ్యారు. తాజాగా.. వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ గాయపడ్డాడు. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్ సందర్భంగా అక్షర్ పటేల్ గాయపడ్డాడు. దీంతో ఓవర్ మధ్యలోనే అతను మైదానాన్ని వీడాడు.

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భాగంగా కివీస్ ఇన్నింగ్స్ 16 ఓవర్లో అక్షర్ పటేల్ బౌలింగ్ చేశాడు. మూడో బంతిని డారిల్ మిచెల్ స్ట్రైట్ డ్రైవ్ షాట్ ఆడాడు. వేగంగా వెళ్తున్న బంతిని ఆపేందుకు అక్షర్ పటేల్ ప్రయత్నించాడు. దీంతో అతని చేతికి బంతి బలంగా తాకడంతో వేలికి గాయమైంది. ఎడమచేతి చూపుడు వేలు చిట్లి తీవ్ర రక్తస్రావం అయింది. నొప్పి ఎక్కువగా ఉండటంతో ఓవర్ మధ్యలోనే అక్షర్ పటేల్ మైదానాన్ని వీడాడు. మిగిలిన ఓవర్ ను అభిషేక్ శర్మ పూర్తి చేశాడు.

అక్షర్ పటేల్ ఎడమచేతి వేలికి బలమైన గాయం కావడంతో శుక్రవారం జరిగే రెండో టీ20 మ్యాచ్‌కు అతను దూరమయ్యే అవకాశం ఉంది. అయితే, అక్షర్ గాయంపై బీసీసీఐ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.


ఇదిలాఉంటే.. బుధవారం రాత్రి నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో సంజూ శాంసన్ 10, అభిషేక్ శర్మ 84, ఇషాన్ కిషన్ 8, సూర్యకుమార్ యాదవ్ 32, హార్దిక్ పాండ్యా 25, శివమ్ దూబే 9, రింకూ సింగ్ 44 (నాటౌట్), అక్షర్ పటేల్ 5, అర్ష్‌దీప్ సింగ్ 6 (నాటౌట్) పరుగులు చేశారు. లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ విఫలమైంది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు మాత్రమే చేయడంతో టీమిండియా విజయం సాధించింది. టీమిండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, శివం దుబే రెండేసి వికెట్లు తీశారు. అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.