India vs New Zealand: తొలి టీ20 మ్యాచ్.. ఆ నలుగురు భారత జట్టులో లేకుండానే బరిలోకి..
న్యూజిలాండ్ జట్టులో క్లార్క్ అరంగేట్రం చేస్తున్నాడు. జేమిసన్, డఫీ కూడా ఆడుతున్నారు.
Suryakumar Yadav, Mitchell Santner (PIC: @BCCI)
- నాగ్‌పూర్‌లోని తొలి టీ20 మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్
- శ్రేయాస్, హర్షిత్, బిష్ణోయ్, కుల్దీప్ జట్టుకు దూరం
India vs New Zealand: ఇండియా, న్యూజిలాండ్ మధ్య ఇవాళ తొలి టీ20 మ్యాచ్ జరుగుతోంది. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది.
ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ముందుగా బౌలింగ్ చేయాలని అనుకున్నామని, అయినా బ్యాటింగ్ చేయడంలో తమకు ఎలాంటి ఇబ్బందీ లేదని వ్యాఖ్యానించాడు. గతంలో తొలుత బ్యాటింగ్ చేసి బాగా ఆడిన సందర్భాలు ఉన్నాయని తెలిపాడు. శ్రేయాస్, హర్షిత్, బిష్ణోయ్, కుల్దీప్ జట్టుకు దూరమయ్యారని చెప్పాడు.
Also Read: నకిలీ ‘పిజ్జా హట్’ ప్రారంభోత్సవానికి వెళ్లి నవ్వులపాలైన పాక్ రక్షణ మంత్రి.. ఏంటయ్యా ఇదీ..
మిచెల్ సాంట్నర్ మాట్లాడుతూ.. “మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. ఈ స్టేడియంలో అధిక స్కోరు వచ్చేలా కనిపిస్తోంది. గత వారం చాలా ప్రత్యేకంగా సాగింది. భారత పర్యటనలో గెలవడం ఎంత కష్టమో ప్రతి జట్టుకూ తెలుసు. వరల్డ్ కప్‌కు సన్నద్ధమయ్యే విషయంలో ఇది మాకు మంచి ఆరంభం. ముగ్గురు సీమర్లు ఉంటారు. క్లార్క్ అరంగేట్రం చేస్తున్నాడు. జేమిసన్, డఫీ కూడా ఆడుతున్నారు” అని తెలిపాడు.
భారత జట్టు: సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా
న్యూజిలాండ్ జట్టు: టిమ్ రాబిన్సన్, డెవన్ కాన్వే (వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), క్రిస్టియన్ క్లార్క్, కైల్ జేమిసన్, ఇష్ సోధి, జేకబ్ డఫీ
