IND vs AUS 1st Test
రెండో రోజు ఆట ముగిసింది. తొలి ఇన్సింగ్స్ లో 144 పరుగుల ఆధిక్యంలో భారత్ ఉంది. టీమిండియా స్కోరు 321/7. క్రీజులో రవీంద్ర జడేజా 66 పరుగులు, అక్షర్ పటేల్ 52 పరుగులతో ఉన్నారు.
రెండో రోజు ఆట ముగిసింది. తొలి ఇన్సింగ్స్ లో 144 పరుగుల ఆధిక్యంలో భారత్ ఉంది. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ చివర్లో ధాటిగా ఆడడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. క్రీజులో రవీంద్ర జడేజా 66 పరుగులు, అక్షర్ పటేల్ 52 పరుగులతో ఉన్నారు. టీమిండియా స్కోరు 321/7 (114.0)గా ఉంది.
టీమిండియా బ్యాటింగ్ కొనసాగుతోంది. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ క్రీజులో పాతుకుపోయారు. అక్షర్ పటేల్ కూడా హాఫ్ సెంచరీ బాదాడు. 9వ స్థానంలో బ్యాటింగ్ కు దిగి అతడు హాఫ్ సెంచరీ చేయడం గమనార్హం. టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయిన వేళ రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ భారత జట్టును ఆదుకున్నారు. ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా 61 పరుగులు, అక్షర్ పటేల్ 50 పరుగులతో ఉన్నారు. టీమిండియా స్కోరు 314/7 (111.0)గా ఉంది.
రవీంద్ర జడేజా అర్ధ సెంచరీ బాదాడు. అందులో ఏడు ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా 51 పరుగులు, అక్షర్ పటేల్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా స్కోరు 265/7 (95 ఓవర్లు)గా ఉంది.
టెస్టుల్లో అరంగ్రేటం చేసిన ఆంధ్రా కుర్రాడు శ్రీకర్ భరత్ (8) వెంటనే ఔట్ అయ్యాడు. మర్ఫీ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ బాటపట్టాడు. తొలుత అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు. ఆసీస్ డీఆర్ఎస్‌కు వెళ్లగా థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. భరత్ ఔట్ కావటంతో క్రీజ్ లోకి అక్షర్ పటేల్ వచ్చాడు. టీమిండియా ప్రస్తుతం 246 పరుగులు చేసింది. 69 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ట్రీ బ్రేక్ తర్వాత టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ (120) ఔట్ అయ్యాడు. ప్యాట్ కమిన్స్ రోహిత్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజ్‌లోకి ఆంధ్రా కుర్రాడు భరత్ వచ్చాడు.
రోహిత్ శర్మ, జడేజా ఇద్దరు నిలకడగా ఆడుతున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్ కు 125 బంతుల్లో 58 పరుగులు జోడించారు. రెండోరోజు మ్యాచ్ ముగిసే వరకు వీరి భాగస్వామ్యం ఇలానే కొనసాగితే టీమిండియా భారీ స్కోర్ సాధించడం ఖాయంగా కనిపిస్తుంది.
భారత బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. ఏమాత్రం తొందరపడకుండా క్రీజ్‌లో ఎక్కువ సమయం ఉండేలా ప్రాధాన్యత ఇస్తున్నారు. పరుగుల స్పీడ్ తగ్గినప్పటికీ వికెట్లు పడకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రస్తుతం టీ బ్రేక్ సమయానికి 80 ఓవర్లకు టీమిండియా 226/5 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (118), జడేజా (34) క్రీజ్‌లో ఉన్నారు. దీంతో టీమిండియా 49 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Tea on Day 2 of the 1st Test.
Captain @ImRo45 leads the charge as #TeamIndia move to 226/5, lead Australia by 49 runs.
Scorecard - https://t.co/edMqDi4dkU #INDvAUS @mastercardindia pic.twitter.com/cNRTv0ZX9b
— BCCI (@BCCI) February 10, 2023
Smiles, claps & appreciation all around! ? ?
This has been a fine knock! ? ?
Take a bow, captain @ImRo45 ??
Follow the match ▶️ https://t.co/SwTGoyHfZx #TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/gW0NfRQvLY
— BCCI (@BCCI) February 10, 2023
భారత కెప్టెన్ రోహిత్ శర్మ (101) సెంచరీ సాధించాడు. టెస్ట్ కెరీర్‌లో రోహిత్‌కు ఇది తొమ్మిదో సెంచరీ. ఈ టీమిండియా హిట్టర్ అన్ని ఫార్మాట్లలో కలిపి 43 సెంచరీలు చేశాడు. వాటిల్లో వన్డేల్లో 30 సెంచరీలు, టీ20ల్లో నాలుగు, టెస్టుల్లో తొమ్మిది సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం 63 ఓవర్లు ముగిసేసరికి టీమ్‌ఇండియా స్కోరు 178/5. రోహిత్‌తో పాటు క్రీజ్‌లో జడేజా ఉన్నాడు.
లంచ్ బ్రేక్ తరువాత టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. నాలుగో వికెట్ రూపంలో విరాట్ కోహ్లీ (12)ని మర్ఫీ ఔట్ చేయగా, ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తక్కువ స్కోర్ కే ఐదో వికెట్ రూపంలో పెవిలియన్ బాట పట్టాడు. లియోన్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ (8) బౌల్డ్ అయ్యాడు. అనంతరం రవీంద్ర జడేజా క్రీజ్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 169/5.
టీమిండియా బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ (85), విరాట్ కోహ్లీ (12) నిలకడగా ఆడుతున్నారు. లంచ్ విరామం సమయానికి భారత్ స్కోర్ 151\3 చేరింది. ఆసిస్ స్కోర్ 177ను సమం చేయడానికి టీమిండియా మరో 26 పరుగుల దూరంలో ఉంది. ఆస్ట్రేలియా బౌలర్లలో మర్ఫీ మూడు వికెట్లు తీసుకున్నాడు. తొలిరోజు మ్యాచ్‌లో కె.ఎల్. రాహుల్ వికెట్ తీసుకున్న ఆస్ట్రేలియా స్పిన్నర్ మర్ఫీ.. రెండోరోజూ తన సత్తాను చాటుకున్నాడు. 44.1 ఓవర్‌లో పుజారా (7)ను ఔట్ చేసిన మర్ఫీ, అంతకుముందు అశ్విన్ (23)ను ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ బాట పట్టించారు. టీమిండియా కోల్పోయిన మూడు వికెట్లు మర్ఫీ తీసినవే కావటం గమనార్హం.
టీమిండియా బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ (85), విరాట్ కోహ్లీ (12) నిలకడగా ఆడుతున్నారు. లంచ్ విరామం సమయానికి భారత్ స్కోర్ 151\3 చేరింది. ఆసిస్ స్కోర్ 177ను సమం చేయడానికి టీమిండియా మరో 26 పరుగుల దూరంలో ఉంది. ఆస్ట్రేలియా బౌలర్లలో మర్ఫీ మూడు వికెట్లు తీసుకున్నాడు.
50 ఓవర్లకు టీమిండియా స్కోర్ 149/3. రోహిత్ శర్మ (85), విరాట్ కోహ్లీ (10) క్రీజ్ లో ఉన్నారు.
భారత్ మూడో వికెట్ కోల్పోయింది. మర్ఫీ వేసిన బౌలింగ్‌లో పుజారా (7) బోలాండ్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అంతకుముందు అశ్విన్ (23)ను మర్ఫీనే ఔట్ చేశాడు. భారత్ మూడు వికెట్లు కోల్పోగా.. ఆ మూడు వికెట్లు తీసింది మర్పీనే కావటం గమనార్హం. ప్రస్తుతం క్రీజ్ లో రోహిత్ శర్మ (83), విరాట్ కోహ్లీ (4) ఉన్నారు. 47 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ స్కోర్ 142/3.
41వ ఓవర్లో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. అశ్విన్ (23) మర్ఫీ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 118/2. క్రీజ్‌లో రోహిత్ (73), ఛతేశ్వర పుజారా (2) ఉన్నారు.
భారత్ బ్యాట్స్‌మెన్లు రోహిత్ శర్మ, అశ్విన్ లు వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతున్నారు. దీంతో 30వ ఓవర్లో పరుగులు ఏమీ రాలేదు. 31వ ఓవర్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. కమిన్స్ వేసిన 32వ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లో చివరి బంతికి రోహిత్ సిక్స్ కొట్టాడు. ప్రస్తుతం ఇండియా స్కోర్ 102/1.
రోహిత్ శర్మ ( 67), అశ్విన్ (14) క్రీజ్‌లో ఉన్నారు.
Day 2️⃣ Ready ?
Captain @ImRo45 leads the talk in the huddle ahead of an important Day with the bat for #TeamIndia ?@mastercardindia pic.twitter.com/T77lkyPco0
— BCCI (@BCCI) February 10, 2023
29ఓవర్లకు టీమిండియా స్కోర్ 94పరుగులకు చేరింది. క్రీజ్‌లో రోహిత్ శర్మ (61), అశ్విన్ (12) పరుగులతో ఉన్నారు. నైట్ వాచ్‌మెన్‌గా వచ్చిన అశ్విన్ దూకుడుగా ఆడుతున్నాడు.
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌పై పట్టు సాధించేందుకు రోహిత్ సేన గురిపెట్టింది. తొలిరోజు ఆటలో అశ్విన్, జడేజా ధ్వయం ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టి పెవిలియన్ బాటపట్టించారు. వారిద్దరి స్పిన్ మాయాజాలంకు ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఒక వికెట్ కోల్పోయి 77 పరుగులు సాధించింది. రోహిత్ శర్మ (56) పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. మొదటి రోజు మ్యాచ్‌లో పూర్తిగా భారత్ జట్టు పైచేయి సాధించింది. రెండోరోజు శుక్రవారం భారీ స్కోర్ సాధించేందుకు రోహిత్ సేన లక్ష్యంగా పెట్టుకుంది. రోహిత్ శర్మ, రవిచంద్ర అశ్విన్ క్రీజ్‌లో ఉన్నారు. రోహిత్ ఇప్పటికే ఆఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. మంచి ఫామ్‌లో ఉన్న రోహిత్ ఆసీస్ బౌలర్లను తేలిగ్గా ఎదుర్కొని పరుగుల వరద పారిస్తాడని టీమిండియా ఫ్యాన్స్ భావిస్తున్నారు. అదే జరిగితే ఆస్ట్రేలియాను మరింత కష్టాల్లోకి నెట్టినట్లవుతుంది. టీమిండియా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. రోహిత్, ఛతేశ్వర్ పుజారా, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్, జడేజా, ఇతర ప్లేయర్లకు ఆసీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొని పరుగులు రాబట్టగలిగే సత్తా ఉంది. ఇదిలాఉంటే తొలిరోజు ఎదురైన ఘోర పరాభవానికి ప్రతీకారం తీర్చుకొనేందుకు ఆసీస్ సిద్ధమవుతోంది. నాగ్‌పూర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండటంతో రెండోరోజు ఆసీస్ స్పిన్ బౌలర్లు ఏమేరకు రాణిస్తారనేది ఆసక్తిగా నెలకొంది.