IND vs AUS: అర్ధసెంచరీలతో చెలరేగిన జడేజా, అక్షర్.. రెండోరోజు 144 పరుగుల ఆధిక్యం

భారత్-ఆస్ట్రేలియా మధ్య నాగ్ పూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచులో రెండో రోజు ఆట ముగిసింది. ఇవాళ చివర్లో అర్ధ సెంచరీలతో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ చెలరేగడంతో భారత్ 144 పరుగుల ఆధిక్యంలో ఉంది. టీమిండియా స్కోరు 321/7గా ఉంది. క్రీజులో రవీంద్ర జడేజా 66 పరుగులు, అక్షర్ పటేల్ 52 పరుగులతో ఉన్నారు.

IND vs AUS 1st Test

IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా మధ్య నాగ్ పూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచులో రెండో రోజు ఆట ముగిసింది. ఇవాళ చివర్లో అర్ధ సెంచరీలతో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ చెలరేగడంతో భారత్ 144 పరుగుల ఆధిక్యంలో ఉంది. టీమిండియా స్కోరు 321/7గా ఉంది. క్రీజులో రవీంద్ర జడేజా 66 పరుగులు, అక్షర్ పటేల్ 52 పరుగులతో ఉన్నారు.

కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా రాణించి 120 పరుగులు చేయడంతో టీమిండియా ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. తొలి టెస్టు మ్యాచ్ ఆడిన ఆంధ్రా కుర్రాడు శ్రీకర్ భరత్ 8 పరుగులకే మర్ఫీ బౌలింగ్ లో ఎల్బీ‌డబ్ల్యూగా వెనుదిగాడు.

టీమిండియా బ్యాట్స్ మెన్ లో రోహిత్ శర్మ 120, కేఎల్ రాహుల్ 20, రవిచంద్రన్ అశ్విన్ 23, ఛటేశ్వర్ పుజారా 7, విరాట్ కోహ్లీ 12, సూర్యకుమార్ యాదవ్ 8, రవీంద్ర జడేజా 66(బ్యాటింగ్), శ్రీకర్ భరత్ 8, అక్షర్ పటేల్ 52 (బ్యాటింగ్) పరుగులు చేశారు.

ఆస్ట్రేలియా బౌలర్లలో ముర్ఫీ 5 వికెట్లు తీయగా, ప్యాట్ కమ్మిన్స్, నాథన్ లియాన్ చెరో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 177 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. అయితే, బౌలింగ్ లో ఆసీస్ కాస్త రాణించడంతో ఆ జట్టుకు ఊరట కలిగించే విషయం. అయినప్పటికీ, క్రీజులో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ జంటను రేపు తొందరగా విడగొట్టకపోతే ఆసీస్ పరిస్థితి క్లిష్టతరంగా మారే అవకాశం ఉంది.

Boron Deficiency : కొబ్బరి సాగులో బోరాన్ లోపం, నివారణ మార్గాలు!