IND vs AUS
India vs Australia 2nd Test Match: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఢిల్లీ వేదికగా జరుగుతుంది. రెండో రోజులు ఆట పూర్తికాగా.. మూడో రోజు ఆట ప్రారంభమైంది. రెండో టెస్టులో విజయంపై ఇరు జట్లు దీమాను వ్యక్తం చేస్తున్నప్పటికీ.. మూడోరోజు ఎవరు పైచేయి సాధిస్తే వారికే విజయావకాశాలు మెండుగా ఉన్నాయి…
For his magnificent all-round performance including a brilliant 7⃣-wicket haul, @imjadeja receives the Player of the Match award ?#TeamIndia win the second #INDvAUS Test by six wickets ????
Scorecard ▶️ https://t.co/hQpFkyZGW8@mastercardindia pic.twitter.com/rFhCZZDZTg
— BCCI (@BCCI) February 19, 2023
2️⃣-0️⃣ ✅@cheteshwar1 with the winning runs as #TeamIndia register a 6️⃣-wicket win in Delhi ??
Scorecard ▶️ https://t.co/hQpFkyZGW8#INDvAUS | @mastercardindia pic.twitter.com/1wrCKXPASU
— BCCI (@BCCI) February 19, 2023
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ లో రెండో టెస్టులోనూ టీమిండియా ఆసీస్‌పై ఘన విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి.. మూడు రోజుల్లోనే ఆటను ముగించేసింది. మూడో రోజు ఆటలో టీమిండియా స్పిన్నర్లు జడేజా, అశ్విన్ విజృంభణతో ఆసీస్ 113 పరుగులకే ఆలౌట్ కాగా.. 115 పరుగుల లక్ష్యంగా బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్ లో 2-0 తేడాతో టీమిండియా ఆధిక్యంలో నిలిచింది.
రెండో టెస్టులో విజయానికి చేరువలో ఉన్న టీమిండియా నాల్గో వికెట్ కోల్పోయింది. శ్రేయాస్ అయ్యర్ (12) నాథన్ లైయన్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. 22 ఓవర్లు పూర్తికాగా.. క్రీజ్ లో భరత్ (1), పుజారా (24) ఉన్నారు. టీమిండియా విజయం సాధించాలంటే మరో 26 పరుగులు చేయాల్సి ఉంది.
టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. మర్ఫీ వేసిన 18 ఓవర్లో విరాట్ కోహ్లీ(20) ఔట్ అయ్యాడు. విరాట్ పెవిలియన్ కు చేరడంతో శ్రేయాస్ అయ్యర్ క్రీజ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం 19వ ఓవర్లకు టీమిండియా స్కోర్ 70/3. పుజారా (17), శ్రేయాస్ (1) క్రీజులో ఉన్నారు. టీమిండియా విజయం సాధించాలంటే మరో 45 పరుగులు చేయాల్సి ఉంది.
రోహిత్ శర్మ ఔట్ తరువాత క్రీజ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీ (3), ఛతేశ్వర్ పుజారా(12) నిలకడగా ఆడుతున్నారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ పరుగులు రాబడుతున్నారు. దీంతో 10 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా స్కోర్ 47/2 కు చేరింది. టీమిండియా విజయం సాధించాలంటే మరో 68 పరుగులు చేయాల్సి ఉంది.
టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. లంచ్ బ్రేక్ తరువాత ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు. ఏడో ఓవర్‌లో రెండో పరుగు కోసం ప్రయత్నించగా రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. రోహిత్ శర్మ దూకుడుగా ఆడటంతో 20 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. అందులో మూడు ఫోర్లు, రెండు సిక్స్ లు ఉన్నాయి.
115 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఆదిలోనే వికెట్ కోల్పోయింది. రాహుల్ (1) నాథన్ లైయన్ వేసిన రెండో ఓవర్లో మొదటి బంతికి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోర్ 14/1 కాగా.. రోహిత్ శర్మ (12), ఛతేశ్వర్ పుజారా (1) క్రీజ్ లో ఉన్నారు. టీమిండియా రెండో టెస్టులోనూ విజయం సాధించాలంటే ఇంకా 101 పరుగులు చేయాల్సి ఉంది.
ఆస్ట్రేలియా పై విజయానికి 115 పరుగుల లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కె.ఎల్. రాహుల్ (1) ఆసీస్ స్పిన్నర్ లైయన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. దీంతో 6 పరుగుల వద్ద టీమ్‌ఇండియా మొదటి వికెట్ కోల్పోయింది
Innings Break!
It was a @imjadeja show here in Delhi as he picks up seven wickets in the morning session.
Australia are all out for 113 runs. #TeamIndia need 115 runs to win the 2nd Test.
Scorecard - https://t.co/1DAFKevk9X #INDvAUS @mastercardindia pic.twitter.com/0h9s37RA85
— BCCI (@BCCI) February 19, 2023
మూడోరోజు ఆట ప్రారంభం నుంచి టీమిండియా స్పిన్నర్లు అశ్విన్, జడేజా ఆసీస్ బ్యాటర్లపై స్పిన్‌తో అటాక్ చేశారు. తొలుత అశ్విన్ దూకుడును ప్రదర్శించి రెండు వికెట్లు తీయగా.. ఆ తరువాత వరుసగా వికెట్లు పడగొడుతూ జడేజా తన విశ్వరూపాన్ని చూపించాడు. ఆసీస్ బ్యాట్స్‌మెన్లు క్రీజ్‌లో నిలదొక్కుకొనేందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వచ్చిన వారిని వచ్చినట్లు పెవిలియన్ బాట పట్టించాడు. రెండో రోజు ఆటలో ఖవాజా వికెట్ పడగొట్టిన జడేజా.. మూడోరోజు లబుషేన్, హ్యాండ్స్ కాంబ్, కమిన్స్, అలెక్స్ కేరీ, నాథన్ లైయన్, కునెమన్లను వెంటవెంటనే ఔట్ చేశాడు. దీంతో రెండో ఇన్నింగ్స్ లో జడేజా ఏడు వికెట్లు తీశాడు. అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు.
Just @imjadeja things ??#INDvAUS pic.twitter.com/6wm0OeykQn
— BCCI (@BCCI) February 19, 2023
జడేజా స్పిన్ దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు విలవిల్లాడారు. పట్టుమని పది నిమిషాలు క్రీజులో నిలవలేక పోయారు. వచ్చిన వారు వచ్చినట్లు పెద్దగా పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ బాట పట్టారు. దీంతో ఆసీస్ 113 పరుగులకే ఆలౌట్ అయింది. 61/1 పరుగులతో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. గంటన్నర వ్యవధిలోనే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. దీంతో టీమిండియా విజయం సాధించాలంటే 115 పరుగులు చేయాల్సి ఉంది.
ఆస్ట్రేలియా తొమ్మిదో వికెట్ కూడా కోల్పోయింది. జడేజా స్పిన్ ధాటికి ఆసీస్ బ్యాటర్లు క్రీజ్ లో నిలువలేక పోతున్నారు. దీంతో వరుసగా పెవిలియన్ బాట పడుతున్నారు. జడేజా వేసిన 30వ ఓవర్లో నాథన్ లైయన్ (8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఆసీస్ 113 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది.
ఆస్ట్రేలియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. జడేజా వేసిన 27 ఓవర్లో అలెక్స్ క్యారీ (7) ఔట్ అయ్యాడు.
Two wickets fall in quick succession.
Marnus Labuschagne and Matt Renshaw depart.
Jadeja and Ashwin strike.
Live - https://t.co/1DAFKevk9X #INDvAUS @mastercardindia pic.twitter.com/S9SsR6SUCa
— BCCI (@BCCI) February 19, 2023
అశ్విన్, జడేజా స్పిన్ జోరుకు ఆసీస్ బ్యాటర్లు పెవిలియన్ బాట పడుతున్నారు. ఏ ఒక్కరూ క్రీజ్‌లో పట్టుమని పది నిమిషాలు నిలవలేక పోతున్నారు. అశ్విన్ వేసిన 22వ ఓవర్లో చివరి బంతికి రెన్ షా(2) ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. లబుషేన్ ఔట్ తరువాత క్రీజ్‌లోకి వచ్చిన హ్యాండ్స్ కాంబ్ (0) జడేజా వేసిన 23వ ఓవర్లో కోహ్లీకి చిక్కాడు. ఆ తరువాత క్రీజ్‌లోకి వచ్చిన ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ (0)ను మరుసటి బంతికే జడేజా ఔట్ చేశారు. దీంతో ఆసీస్ 95 పరుగుల వద్ద ఏడు వికెట్లు కోల్పోయింది.
అశ్విన్, జడేజా స్పిన్ బౌలింగ్ దాటికి ఆసీస్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్ బాటపడుతున్నారు. మూడో రోజు మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే హెడ్, స్మిత్ ఔట్ కాగా.. దూకుడుగా ఆడుతున్న లబుషేన్(35) ఔట్ అయ్యాడు. అశ్విన్ వేసిన 22వ ఓవర్లో నాలుగో బంతికి లబుషేన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
Ashwin strikes again as Steve Smith is given out LBW.
Australia 85/3 in the second innings.
Live - https://t.co/hQpFkyZGW8 #INDvAUS @mastercardindia pic.twitter.com/RBS9tN1QPt
— BCCI (@BCCI) February 19, 2023
61 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి. అశ్విన్ స్పిన్ బౌలింగ్ దాటికి హెడ్, స్మిత్‌లు క్రీజ్‌లో నిలవలేక వెంటనే ఔట్ అయ్యారు. 21 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆసీస్ 93/3 పరుగులు చేసింది. క్రీజ్‌లో లబుషేన్ (34), రేన్ షా (1) ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ 94 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. అశ్విన్ స్పిన్ బౌలింగ్‌కు ఆసీస్ బ్యాటర్లు క్రీజ్‌లో నిలవలేక పోతున్నారు. హెడ్ ఔట్ తరువాత క్రీజ్‌లోకి వచ్చిన స్టీవ్ స్మిత్ (3) వెంటనే ఔట్ అయ్యాడు.
Ashwin strikes early on!
Travis Head is caught behind for 43 runs.
Live - https://t.co/1DAFKevk9X #INDvAUS @mastercardindia pic.twitter.com/WLWKJbVNsz
— BCCI (@BCCI) February 19, 2023
మూడో రోజు ఆట ప్రారంభం కాగా.. మొదటి ఓవర్లోనే ఆసీస్ వికెట్ కోల్పోయింది. అశ్విన్ వేసిన ఓవర్లో చివరి బంతికి ట్రావిస్ హెడ్ (43) ఔట్ అయ్యాడు. దీంతో 65 పరుగుల వద్ద ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది.
భారత్, ఆసీస్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ లో భాగంగా మూడో రోజు ఆట ప్రారంభమైంది. 61 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‍తో ఆసీస్ బ్యాటింగ్‌ను ప్రారంభించింది.
Stumps on Day 2⃣ of the second #INDvAUS Test!
1️⃣ wicket for @imjadeja as Australia reach 61/1 at the end of day's play.
A crucial day coming up tomorrow ??
Scorecard ▶️ https://t.co/hQpFkyZGW8…#TeamIndia | @mastercardindia pic.twitter.com/Jr6AHAGDUf
— BCCI (@BCCI) February 18, 2023
రెండో టెస్టులో విజయం సాధించాలని ఇండియా, ఆస్ట్రేలియా జట్లు పట్టుదలతో ఉన్నాయి. అయితే, ఇరుజట్లకు మూడో రోజు ఆట కీలకం కానుంది. ఆదివారం ఆసీస్ బ్యాటర్లు భారత్ స్పిన్నర్లను ఏ విధంగా ఎదుర్కొంటారనే అంశంపైనే ఆ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఢిల్లీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండటంతో ఆసీస్ బ్యాటర్లకు టీమిండియా స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవటం కొంచెం కష్టమైన పనే. స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు రాబట్టగలిగితే ఆసీస్‌కు విజయావకాశాలు మెండుగా ఉంటాయని మాజీ క్రికెటర్లు అభిప్రాయ పడుతున్నారు. ఇక, మూడోరోజు ఆటలో ఆసీసీ బ్యాటర్లను తక్కువ స్కోర్ కే పెవిలియన్ బాటపట్టిస్తే.. టీమిండియా విజయం నల్లేరుపై నడకే అవుతుంది.