IND vs AUS 3rd test day2
IND vs AUS 3rd test day2: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య గబ్బా వేదికగా మూడో టెస్టు జరుగుతుంది. తొలి రోజు మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించగా.. రెండోరోజు ఆటలో పూర్తిస్థాయిలో మ్యాచ్ జరిగింది. 28 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో క్రీజులోకి వచ్చిన ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్ స్వీని తక్కువ పరుగులకే ఔట్ అయినా.. ట్రావిస్ హెడ్ (152), స్టీవ్ స్మిత్ (101) సెంచరీలతో చెలరేగిపోయారు. దీంతో ఆస్ట్రేలియా భారీ స్కోర్ ను సాధించింది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఏడు వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో జస్ర్పీత్ బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో వికెట్ పడగొట్టారు.
Also Read: IND vs AUS : అట్లుంటది సిరాజ్‌తో పెట్టుకుంటే.. లబుషేన్, సిరాజ్ మధ్య ఆసక్తికర ఘటన.. వీడియో వైరల్
టీమిండియాకు గబ్బా టెస్టు మ్యాచ్ ఎంతో కీలకం. ఇప్పటికే ఈ టోర్నీలో రెండు టెస్టులు జరగ్గా 1-1తో ఇరు జట్లు సమఉజ్జీలుగా ఉన్నాయి. గబ్బా టెస్టులో టీమిండియా ఓడిపోతే వచ్చే ఏడాది జరిగే వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ కు వెళ్లే అవకాశాలను దాదాపుగా కోల్పోతుంది. దీంతో ఈ మ్యాచ్ లో విజయం సాధించాలని టీమిండియా పట్టుదలతో ఉంది. అయితే, రెండోరోజు ఆటలో ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేయడంలో భారత్ బౌలర్లు విఫలమయ్యారు. కేవలం బుమ్రా మినహా మిగిలిన బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. ప్రస్తుతం 405 పరుగుల వద్ద ఉండగా.. సోమవారం మ్యాచ్ లో మరో 50 పరుగులు జోడించి ఆస్ట్రేలియా డిక్లేర్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆసీస్ విసిరిన సవాల్ ను అధిగమించాలంటే టీమిండియా బ్యాటర్లు క్రీజులో ఉండి వేగంగా పరుగులు రాబాట్టాల్సిన పరిస్థితి.
Also Read: IND vs AUS: నితీశ్ రెడ్డి సూపర్ బౌలింగ్.. కోహ్లీ సెలబ్రేషన్స్ చూశారా.. వీడియో వైరల్
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా గత రెండు టెస్టుల్లో బ్యాటింగ్ విభాగంలో భారత్ బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేదు. ముఖ్యంగా రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్ లలోనూ పరుగులు రాబట్టడంలో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్ 180, రెండో ఇన్నింగ్స్ లో 175 పరుగులు మాత్రమే చేయగలిగారు. ప్రస్తుతం గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా టీమిండియా ముందు భారీ స్కోర్ ను ఉంచబోతుంది. ఇప్పటికే ఆసీస్ స్కోర్ 400 దాటింది. భారీ స్కోర్ ను ఛేదించాలంటే ఓపెనర్లు యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్ తో పాటు భారత్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలతోపాటు నితీశ్ కుమార్ సైతం బ్యాటింగ్ లో రాణించాల్సి ఉంది. వెంటనే వెంటనే వికెట్లు పడకుండా క్రీజులో పాతుకుపోయి ఓపిగ్గా పరుగులు రాబట్టాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో వరుగా రెండు టెస్టుల్లో విఫలమవుతూ వస్తున్న టీమిండియా బ్యాటర్లు ఆస్ట్రేలియా నిర్దేశించబోయే భారీ స్కోర్ ను ఎలా చేధిస్తారోనని టీమిండియా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
Australia on top at the end of Day 2.#WTC25 | #AUSvIND 📝: https://t.co/Nh59FEIf0u pic.twitter.com/RGDzi6Jt2c
— ICC (@ICC) December 15, 2024