IND vs AUS: నితీశ్ రెడ్డి సూపర్ బౌలింగ్.. కోహ్లీ సెలబ్రేషన్స్ చూశారా.. వీడియో వైరల్
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మూడో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. బుమ్రాతో పాటు సిరాజ్, ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ రెడ్డిలు కట్టుదిట్టమైన బంతులతో ఆస్ట్రేలియా బ్యాటర్లను హడలెత్తించారు.

Nitish Kumar Reddy
Nitish Kumar Reddy: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య బిస్బేన్ లోని గర్బా వేదికగా మూడో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. శనివారం ఉదయం మ్యాచ్ ప్రారంభం కాగా.. టాస్ గెలిచి రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రారంభించిన కొద్దిసేపటికే ఎడతెరిపిలేని వర్షం కురవడంతో తొలిరోజు కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది. దీంతో ఆస్ట్రేలియా వికెట్లేమీ కోల్పోకుండా 28 పరుగులు చేసింది. క్రీజులో ఖవాజా, మెక్ స్వీనే ఉన్నారు. రెండోరోజు ఆదివారం ఆట ప్రారంభం కాగా.. కొద్దిసేపటికే బుమ్రా ఆస్ట్రేలియాకు బిగ్ షాకిచ్చాడు. ఓపెనర్లు ఖవాజా (21), మెక్ స్వీన్ (9)ని అవుట్ చేశాడు.
Also Read: IND vs AUS: మూడో టెస్ట్.. ఆస్ట్రేలియాకు బిగ్ షాకిచ్చిన బుమ్రా
బుమ్రాతో పాటు సిరాజ్, ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ రెడ్డిలు కట్టుదిట్టమైన బంతులతో ఆస్ట్రేలియా బ్యాటర్లను హడలెత్తించారు. దీంతో పరుగులు రాబట్టేందుకు ఆసీస్ బ్యాటర్లు ఇబ్బందిపడ్డారు. ఈ క్రమంలో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి సూపర్ బౌలింగ్ తో మూడో వికెట్ పడగొట్టాడు. డేంజరస్ బ్యాటర్ మార్నస్ లుబుషేన్ (12)ను పెవిలియన్ బాటపట్టించాడు. నితీశ్ రెడ్డి వేసిన బంతిని ఆఫ్ సైడ్ ఆడేందుకు లుబుషేన్ ప్రయత్నించగా.. బాల్ బ్యాట్ అంచుకు తాకి స్లిప్ వైపుకు దూసుకెళ్లింది. స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ క్యాచ్ అందుకున్నాడు. ఆ వెంటనే తనదైన శైలిలో సెలబ్రేషన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
గబ్బా పిచ్ బౌలింగ్ కు సహకరిస్తుండటంతో భారత్ బౌలర్లు సద్వినియోగం చేసుకుంటున్నారు. బుమ్రాతోపాటు సిరాజ్, నితీశ్ రెడ్డి, ఆకాశ్ దీప్ కట్టుదిట్టమైన బంతులతో బౌలింగ్ చేస్తుండటంతో ఆసీస్ బ్యాటర్లు పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఆస్ట్రేలియా బ్యాటర్లు స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ లు ఆచితూచి ఆడుతూ మరో వికెట్ పడకుండా క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నారు.
Nitish Kumar Reddy gets Labuschagne followed by an aggressive celebration of Virat Kohli 🔥 pic.twitter.com/JPVBNwriPe
— Johns. (@CricCrazyJohns) December 15, 2024