IND vs AUS: మూడో టెస్ట్.. ఆస్ట్రేలియాకు బిగ్ షాకిచ్చిన బుమ్రా
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ బిస్బేన్ లోని గర్బా వేదికగా జరుగుతుంది.

Bumrah
India vs Australia 3rd Test: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ బిస్బేన్ లోని గర్బా వేదికగా జరుగుతుంది. శనివారం ఆట ప్రారంభం కాగా.. టీమిండియా కెప్టెన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు. వరుణుడు దెబ్బతో తొలిరోజు కేవలం 13.2 ఓవర్లు ఆట మాత్రమే జరిగింది. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 28పరుగులు చేసింది. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా (19), మెక్ స్వీని (4) పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండోరోజు ఆదివారం భారత కాలమానం ప్రకారం ఉదయం 5.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా ఆస్ట్రేలియాకు బిగ్ షాకిచ్చాడు.
మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే 16వ ఓవర్లో బుమ్రా వేసిన తొలి బంతికి ఖవాజా (21) అవుట్ అయ్యాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. మరికొద్దిసేపటికే బుమ్రా వేసిన 19వ ఓవర్లో మెక్ స్వీనే(19) అవుట్ అయ్యాడు. 19వ ఓవర్లో మూడో బంతిని మెక్ స్వీనే భారీ షాట్ కొట్టే ప్రయత్నం చేయగా.. బాల్ గాల్లోకి లేచింది. దీంతో కోహ్లీ ఆ బాల్ ను క్యాచ్ అందుకున్నాడు. దీంతో రెండోరోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే ఓపెనర్లు ఇద్దరిని అవుట్ చేసి ఆస్ట్రేలియాకు బుమ్రా షాకిచ్చాడు.
జస్ర్పీత్ బుమ్రాతో పాటు భారత్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, నితీశ్ రెడ్డిసైతం కట్టుదిట్టమైన బంతులతో బౌలింగ్ చేస్తుండటంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడుతున్నారు. మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతున్నారు.
Bumrah strikes in his second over as Usman Khawaja is caught behind for 21 runs.
Live – https://t.co/dcdiT9NAoa… #AUSvIND pic.twitter.com/f7t93a7CCB
— BCCI (@BCCI) December 15, 2024