IND vs AUS 3rd Test : గబ్బాలో ప్రత్యక్షమైన సచిన్ కూతురు సారా టెండూల్కర్.. అతడి కోసమే వచ్చిందా?
మ్యాచ్ చూసేందుకు టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ వచ్చింది.

Sara Tendulkar Spotted Cheering For India During Gabba Test
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచుల సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు నువ్వా నేనా అన్నట్లుగా తలపడనున్నాయి. తొలి మ్యాచులో భారత్ గెలవగా, రెండో మ్యాచులో ఆస్ట్రేలియా గెలిచింది. ఇక కీలకమైన మూడో టెస్టు మ్యాచ్ బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా శనివారం ప్రారంభమైంది. కాగా.. ఈ మ్యాచ్ చూసేందుకు టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ వచ్చింది.
ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చొని టీమ్ఇండియాకు మద్దతు తెలిపింది. సారా మైదానంలో సందడి చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సారా వెనుక సీటులో మాజీ క్రికెటర్లు జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్‌లు కనిపించారు. వీరు కూడా మ్యాచ్ చూసేందుకు వచ్చారు.
NZ vs ENG : కేన్ మామ నీకే ఎందుకిలా.. విచిత్రరీతిలో ఔటైన కేన్ విలియమ్సన్.. వీడియో వైరల్
అయితే.. సారా టీమ్ఇండియా కోసం కాదని శుభ్‌మన్ గిల్ కోసం వచ్చిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో గిల్ సెంచరీ చేయడం ఖాయమని అంటున్నారు. గిల్, సారాలు గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారనే రూమర్లు వస్తూనే ఉన్నాయి. అవి నిజం అన్నట్లుగా వీరిద్దరు కలిసి కొన్ని కార్యక్రమాలకు హాజరైన ఫోటోలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ వార్తలపై ఇటు గిల్ కానీ, అటు సారా గానీ స్పందించలేదు. సచిన్ టెండూల్కర్ కూడా ఈ వార్తలను ఖండించకపోవడం గమనార్హం.
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. వర్షం కారణంగా తొలి రోజు కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా (19), నాథన్ మెక్‌స్వీనీ (4) క్రీజులో ఉన్నారు. ఇక మిగిలిన నాలుగు రోజులు కూడా మ్యాచ్‌కి వర్షం అడ్డంకిగా మారే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Sara Tendulkar in the Stands ; Shubman Gill’s 💯 loading 👀 #INDvsAUS #BGT2025 #AUSvsIND pic.twitter.com/oW7K3sK0Xw
— THAKUR (@JThakur29) December 14, 2024