NZ vs ENG : కేన్ మామ నీకే ఎందుకిలా.. విచిత్ర‌రీతిలో ఔటైన కేన్ విలియ‌మ్స‌న్‌.. వీడియో వైర‌ల్‌

న్యూజిలాండ్ స్టార్ బ్యాట‌ర్ కేన్ విలియ‌మ్స‌న్ విచిత్ర రీతిలో ఔటై పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

NZ  vs ENG : కేన్ మామ నీకే ఎందుకిలా.. విచిత్ర‌రీతిలో ఔటైన కేన్ విలియ‌మ్స‌న్‌.. వీడియో వైర‌ల్‌

Kane Williamson bizarre dismissal in Hamilton test

Updated On : December 14, 2024 / 1:22 PM IST

హామిల్టన్‌లోని సెడాన్ పార్క్ వేదిక‌గా ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య మూడో టెస్టు మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్టార్ బ్యాట‌ర్ కేన్ విలియ‌మ్స‌న్ విచిత్ర రీతిలో ఔటై పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కివీస్ మొద‌ట బ్యాటింగ్‌కు దిగింది. ఓపెన‌ర్లు టామ్ లాథమ్ (63), విల్ యంగ్ (42)లు తొలి వికెట్‌కు 105 ప‌రుగులు జోడించి బ‌ల‌మైన పునాది వేశారు. వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన కేన్ విలియ‌మ్స‌న్ చ‌క్క‌టి బ్యాటింగ్‌తో అల‌రించాడు. త‌న‌దైన శైలిలో చూడ‌చ‌క్క‌ని షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును ప‌రుగులు పెట్టించాడు. అయితే.. ఆఫ్ సెంచ‌రీకి ఆరు ప‌రుగుల దూరంలో అనూహ్య రీతిలో పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

IND vs AUS : గ‌బ్బాలో వ‌రుణుడి ఆట‌.. ముగిసిన తొలి రోజు ఆట‌.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన క్రికెట్ ఆస్ట్రేలియా..

59వ ఓవ‌ర్‌ను మాథ్యూ పాట్స్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని చివ‌రి బంతిని విలియ‌మ్స‌న్ డిఫెన్స్ ఆడాడు. అయితే.. ఆ బంతి బౌన్స్ అయి స్టంప్స్ వైపుగా వెళ్లింది. వికెట్ల పై బాల్ ప‌డుతుంద‌ని భావించిన విలియ‌మ్స‌న్‌.. బంతిని ప‌క్క‌కు నెట్టాల‌ని భావించాడు. ఈ క్ర‌మంలో త‌న కాలిలో బంతికి ప‌క్క‌కు అనాల‌ని అనుకున్నాడు. అయితే.. అత‌డి చ‌ర్య కంటే ముందుగానే బంతి వికెట్ల‌ను ప‌డ‌గొట్టింది. దీంతో కేన్ మామ తీవ్ర అస‌హ‌నానికి గురైయ్యాడు. నిరాశ‌గా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో విలియ‌మ్స‌న్ 87 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లో 44 ప‌రుగులు చేశాడు. ఇక తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి న్యూజిలాండ్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల న‌ష్టానికి 315 ప‌రుగులు చేసింది. మిచెల్ శాంట్న‌ర్ (50), విలియం ఒరోర్కే (0) క్రీజులో ఉన్నారు.

IND vs AUS 3rd Test : రోహిత్ శ‌ర్మ నిర్ణ‌యం పై బుమ్రా అసంతృప్తి.. స్టంప్ మైక్‌లో మాట‌లు రికార్డు..