IND vs AUS : గ‌బ్బాలో వ‌రుణుడి ఆట‌.. ముగిసిన తొలి రోజు ఆట‌.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన క్రికెట్ ఆస్ట్రేలియా..

గ‌బ్బా వేదిక‌గా భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య ప్రారంభమైన మూడో టెస్టు మ్యాచ్ మ్యాచ్‌కు వ‌రుణుడు ఆటంకం క‌లిగిస్తున్నాడు.

IND vs AUS : గ‌బ్బాలో వ‌రుణుడి ఆట‌.. ముగిసిన తొలి రోజు ఆట‌.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన క్రికెట్ ఆస్ట్రేలియా..

India vs Australia 3rd test day 1 stumps after Relentless rain

Updated On : December 14, 2024 / 12:54 PM IST

గ‌బ్బా వేదిక‌గా భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య ప్రారంభమైన మూడో టెస్టు మ్యాచ్ మ్యాచ్‌కు వ‌రుణుడు ఆటంకం క‌లిగిస్తున్నాడు. వ‌ర్షం కార‌ణంగా తొలి రోజు కేవ‌లం 13.2 ఓవ‌ర్ల ఆట మాత్ర‌మే సాధ్య‌మైంది. దాదాపు రెండు న్న‌ర సెష‌న్ల ఆట వ‌ర్షార్ప‌ణ‌మైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త్ బౌలింగ్ ఎంచుకుంది. తొలి సెష‌న్‌లో 13.2 ఓవ‌ర్లు పూర్తి అయిన త‌రువాత‌ వ‌ర్షం ప్రారంభ‌మైంది.

ఎంత‌కీ వ‌రుణుడు శాంతించ‌క‌పోవ‌డంతో మిలిగిన ఆట‌ను ర‌ద్దు చేశారు. తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఆసీస్ వికెట్ న‌ష్ట‌పోకుండా 28 ప‌రుగులు చేసింది. క్రీజ్‌లో నాథన్‌ మెక్‌స్వీనీ (4*), ఉస్మాన్ ఖవాజా (19*) ఉన్నారు.

IND vs AUS 3rd Test : రోహిత్ శ‌ర్మ నిర్ణ‌యం పై బుమ్రా అసంతృప్తి.. స్టంప్ మైక్‌లో మాట‌లు రికార్డు..

తొలి రోజు ఆట ర‌ద్దు కావ‌డంతో రెండో రోజు (ఆదివారం) ఆట అర్థ‌గంట ముందుగానే ప్రారంభం కానుంది. అంటే భారత కాలమానం ప్రకారం ఉదయం 5.20 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కనీసం 98 ఓవర్లపాటు మ్యాచ్‌ సాగనుంది. అయితే.. మ్యాచ్ జ‌ర‌గ‌నున్న‌ ఐదు రోజుల పాటు వ‌రుణుడు ఆటంకాలు క‌లిగించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు వాతావర‌ణ శాఖ తెలిపింది. దీంతో మిగిలిన నాలుగు రోజుల్లోనైనా మ్యాచ్ స‌జావుగా సాగుతుందా లేదా అని అభిమానుల్లో టెన్ష‌న్ నెలకొంది.

ఇక తొలి రోజును ప్ర‌త్య‌క్షంగా వీక్షిద్దామ‌ని వ‌చ్చిన క్రికెట్ అభిమానుల‌కు వ‌రుణుడి కార‌ణంగా నిరాశ ఎదురైంది. అయితే.. క్రికెట్ ఆస్ట్రేలియా వారికి శుభవార్త చెప్పింది. తొలి రోజు ఆట టికెట్ల సొమ్మును రిఫండ్ చేస్తామ‌ని తెలిపింది.

Babar Azam : టీ20ల్లో చ‌రిత్ర సృష్టించిన బాబ‌ర్ ఆజాం.. క్రిస్‌గేల్‌ ఆల్ టైం టీ20 రికార్డ్ బ్రేక్‌..